Virat Kohli | రాంచీలో రేపే తొలి వన్డే.. సచిన్ ‘ఆల్‌టైమ్ రికార్డు’పై కన్నేసిన కోహ్లీ..!
Virat Kohli : రాంచీలో ఆదివారం జరుగబోయే తొలి వన్డే కోసం రన్ మెషీన్ విరాట్ సుదీర్ఘ సమయం నెట్స్‌లో చెమటోడ్చాడు. రాంచీలో శతకం సాధించాడంటే ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలతో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు.
Virat Kohli : భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచే మొదలవ్వనుంది. టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌తో పరువు పోగొట్టుకున్న టీమిండియా 50 ఓవర్ల ఫార్మాట్లో విజయంతో మురవాలనే కసితో ఉంది. అనుభవజ్ఞులైన విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ స్క్వాడ్‌తో కలవడం జట్టు బలాన్ని పెంచింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆఖరి వన్డేలో దంచేసిన ఈ ద్వయం.. ఇప్పుడు స్వదేశంలోనూ సత్తా చాటాలనే కసితో ఉంది. రాంచీలో ఆదివారం జరుగబోయే తొలి వన్డే కోసం రన్ మెషీన్ విరాట్ సుదీర్ఘ సమయం నెట్స్‌లో చెమటోడ్చాడు. రాంచీలో శతకం సాధించాడంటే ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలతో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట ఉన్న ‘ఆల్‌టైమ్ రికార్డు’ను కోహ్లీ అధిగమిస్తాడు.
వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయిన కోహ్లీ కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. కానీ, వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ నికలడగా రాణించాల్సి ఉంది. ఆసీస్ పర్యటనలో రెండు డకౌట్ల తర్వాత ఆఖరి వన్డేలో అజేయ అర్ధ శతకం బాదిన విరాట్.. ఇప్పుడు స్వదేశంలో చెలరేగిపోవాలనే పట్టుదలతో ఉన్నాడు. రెండేళ్ల క్రితం వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌పై సూపర్ సెంచరీతో సచిన్ టెండూల్కర్ రికార్డు (49 శతకాలను) సమం చేసిన కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై అలాంటి భారీ ఇన్నింగ్స్ ఆడాలని భారత కెప్టెన్ రాహుల్, కోచ్ గంభీర్ ఆశిస్తున్నారు.
— BCCI (@BCCI) November 29, 2025
సఫారీలపై రాంచీలో విరాట్ సెంచరీ కొడితే వన్డేల్లో అత్యధికసార్లు మూడంకెల స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. ఒకవేళ రాంచీలో 64 పరుగులే చేసినా అతడు ద్వైపాక్షిక వన్డే సిరీస్ (Bilateral ODI Sereis)లో10 వేల పరుగుల క్లబ్లో చేరుతాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 9,936 రన్స్ ఉండగా.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) 7,669 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
9 నెలల విరామం తర్వాత
సొంతగడ్డపై కోహ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరి వన్డే ఆడాడు. దాదాపు 9 నెలల విరామం తర్వాత తనదైన బ్యాటింగ్‌తో అభిమానులను రంజింపజేసేందుకు సిద్ధమవుతున్నాడీ రికార్డ్ బ్రేకర్. టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయంతో డీలా పడిన జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపి.. అదిరే విజయాన్ని కట్టబెట్టాలని కోహ్లీ భావిస్తున్నాడు. అందుకే.. శనివారం నెట్స్‌లో అతడు అన్ని రకాల షాట్లు ఆడుతూ తన ఫుట్‌వర్క్ చాటుకున్నాడు. బ్యాక్ఫుట్లోనూ సాధన చేసిన కింగ్ కోహ్లీ.. త్రోడౌన్ బంతుల్ని సమర్ధంగా ఎదుర్కొన్నాడు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, కుర్రాడు యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal)సైతం నెట్స్‌లో చెమటోడ్చారు. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో హిట్‌మ్యాన్‌తో కలిసి యశస్వీ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.
Lights 💡
Camera 📸
Action 🎬A fun BTS sneak peek as #TeamIndia gets ready for the #INDvSA ODI series opener in Ranchi 🥳@IDFCFIRSTBank pic.twitter.com/JK2IdsxnJ8
— BCCI (@BCCI) November 29, 2025
టీమిండియా స్క్వాడ్ : రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, నితీశ్ రెడ్డి, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

