Virat Kohli: విరాట్ కోహ్లీ ఎంట్రీకి 15 ఏళ్లు.. ఆ డ్యాషింగ్ బ్యాటర్ రికార్డులివ్వే
Virat Kohli : కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌కు 15 ఏళ్లు నిండాయి. 2008లో శ్రీలంక వన్డేతో అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అతను బ్యాటింగ్ రికార్డులను నెలకొల్పాడు. ఆ రికార్డులను ఓ సారి పరిశీలిద్దాం.
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్లోకి విరాట్ కోహ్లీ(Virat Kohli) అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు గడిచాయి. ఆ డ్యాషింగ్ క్రికెటర్.. 2008లో శ్రీలంకతో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు. అంతకముందు అతను ఐసీసీ అండర్19 క్రికెట్ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. విరాట్ తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్మేట్ గంభీర్‌తో కలిసి ఓపెనింగ్ బ్యాటర్‌గా ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను 12 రన్స్ చేశాడు. తొలి 5 మ్యాచుల్లో 31.80 యావరేజ్‌తో 159 రన్స్ చేశాడు.
ఇప్పటి వరకు కోహ్లీ భారత్ తరపున 111 టెస్టులు ఆడాడు. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. తొలుత 5 ఇన్నింగ్స్‌లో అతను కేవలం 76 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. టెస్టుల్లో విరాట్ మొత్తం 8,676 రన్స్ స్కోర్ చేశాడు. దాంట్లో 29 సెంచరీలు, 29 ఫిఫ్టీలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన అయిదవ భారతీయ క్రికెటర్. టెస్టుల్లో విరాట్ పేరిట ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి.
టెస్టు కెప్టెన్‌గా కోహ్లీకి మంచి రికార్డు ఉంది. 68 టెస్టులకు అతను కెప్టెన్సీ చేశాడు. దాంట్లో 40 గెలిచాడు. 17 ఓడిపోయాడు. మరో 11 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అంటే విన్నింగ్ శాతం 58.82గా ఉంది. వన్డేల్లో విరాట్ రికార్డు అత్యద్భుతంగా ఉంది. అతను 275 వన్డేలు ఆడాడు. దాంట్లో 12,898 రన్స్ స్కోర్ చేశాడతను. 57.32 యావరేజ్‌తో బ్యాటింగ్ చేశాడు. 265 వన్డే ఇన్నింగ్స్‌లో 46 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 183. సచిన్ తర్వాత వన్డేల్లో ఎక్కువ రన్స్ చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు.
వన్డే కెప్టెన్‌గా కూడా విరాట్‌కు మంచి రికార్డు ఉంది. 95 మ్యాచుల్లో అతను జట్టుకు నాయకత్వం వహించాడు. దీంట్లో ఇండియా 65 మ్యాచుల్లో నెగ్గింది, 27 మ్యాచుల్లో ఓడింది. విన్నింగ్ శాతం 68గా ఉంది. 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో విరాట్ సభ్యుడిగా ఉన్నాడు. వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు 26 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ .. 46 సగటుతో 1030 రన్స్ చేశాడు. దీంట్లో రెండు సెంచరీలు, అయిదు ఫిఫ్టీలు ఉన్నాయి.
టీ20ల్లోనూ కోహ్లీ తన రికార్డును పదిలం చేసుకున్నాడు. 115 మ్యాచ్‌లు ఆడిన అతను 4008 రన్స్ చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 52.73 కాగా, స్ట్రయిక్ రేట్ 13.96గా ఉంది. దీంట్లో ఓ సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోర్ 122 రన్స్. టీ20ల్లో కోహ్లీ 15 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఏడు సార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు.
టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన 27 మ్యాచుల్లో అతను 1141 రన్స్ చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 81.50గా ఉంది. 2014, 2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డు కైవసం చేసుకున్నాడు. 2011-20 కాలానికి చెందిన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ అవార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు.
అరుదైన రికార్డులు
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండవ క్రికెటర్ విరాట్ కోహ్లీ. ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు ఎక్కువ సార్లు గెలిచాడు. వన్డేల్లో అత్యధిక సంఖ్యలో క్యాచ్‌లు పట్టాడు. వన్డేల్లో 7 నుంచి 12 వేల పరుగుల వరకు చాలా వేగంగా స్కోర్ చేశాడు. వన్డేల్లో అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ ఉంది. శ్రీలంకపై అత్యధికంగా వన్డేల్లో 10 సెంచరీలు చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసింది కూడా కోహ్లీనే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

