Virat Kohli: విరాట్ కోహ్లీ 38వ బర్త్‌డే.. విషెస్ చెప్పిన బీసీసీఐ
Virat Kohli: విరాట్ కోహ్లీ ఇవాళ 38వ బర్త్‌డే జరుపుకుంటున్నారు. జీనియస్ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన కింగ్ కోహ్లీ.. ప్రస్తుతం తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 566 అంతర్జాతీయ మ్యాచుల్లో కోహ్లీ 28601 రన్స్ చేసినట్లు బీసీసీఐ తన ఎక్స్‌లో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో కోహ్లీకి బర్త్‌డే విషెస్ చెప్పింది.
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇవాళ 38వ బర్త్‌డే జరుపుకుంటున్నారు. జీనియస్ క్రికెట్ప్లేయర్గా గుర్తింపు పొందిన కోహ్లీ.. ప్రస్తుతం తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐకాన్ బ్యాటర్‌గా ఖ్యాతి గాంచిన అతను.. దాదాపు రెండు దశాబ్ధాల నుంచి భారత క్రికెట్‌కు సేవలు అందిస్తున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బాటలో పయనిస్తూ అతని రికార్డులను కోహ్లీ తిరగరాస్తున్న విషయం తెలిసిందే. కీలకమైన దశల్లో పరుగులు సాధిస్తూ జట్టును విజయపథంలో నడిపిస్తున్న కోహ్లీ బర్త్‌డే సందర్భంగా బీసీసీఐ ఓ ట్వీట్ చేసింది. తన ఎక్స్ అకౌంట్లో విషెస్‌ను పోస్టు చేసింది.
కోహ్లీ 566 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడని, ఇంకా అతను ఆడుతూనే ఉన్నాడని ఆ ట్వీట్లో చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో అతను మొత్తం 28601 రన్స్ చేశాడని, ఇంకా అతని పరుగుల దాహం తీరలేదని బీసీసీఐ పేర్కొన్నది. కోహ్లీ ఖాతాలో మొత్తం 86 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయని కూడా బీసీసీఐ తన ఎక్స్‌లో తెలిపింది. ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్‌కప్ 2011, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2013, 2025, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2024 జట్టులో కోహ్లీ సభ్యుడిగా ఉన్నట్లు బీసీసీఐ చెప్పింది. క్రికెట్ ఆటలో అత్యుత్తమ ప్లేయర్‌గా కొనసాగుతున్న కోహ్లీకి బర్త్‌డే విషెస్ చెబుతున్నట్లు బీసీసీఐ తన ఎక్స్‌లో పేర్కొన్నది.
5️⃣6️⃣6️⃣ Intl. Matches & Counting 🫡
2️⃣8️⃣6️⃣0️⃣1️⃣ Intl. Runs & Counting 👏
8️⃣6️⃣ Intl. Centuries & Counting 👑Winner of ICC Men’s ODI World Cup 2011, ICC Champions Trophy 2013 & 2025, and ICC Men’s T20 World Cup 2024 🏆
Happy Birthday to one of the finest to ever grace the game, Virat Kohli 🎂🥳
#TeamIndia | @imVkohli
— BCCI (@BCCI) November 5, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virat Kohli: విరాట్ కోహ్లీ 38వ బర్త్‌డే.. విషెస్ చెప్పిన బీసీసీఐ
Water Crisis | తాగేందుకు నీళ్లు లేవు.. బాత్రూంకూ బయటకే వెళ్లాల్సిన దుస్థితి.. బషీరాబాద్ ఎస్సీ హాస్టల్లో నీటి కష్టాలు!
సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. PURE EV స్కూటీ తయారీ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
Payal Rajput | రాధికా ఆప్టే వ్యాఖ్యలకు పాయల్ రాజ్‌పుత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘టాలీవుడ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నా!’
Khammam SDRF | గల్లంతైన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమం.. ఒకరి కోసం గాలింపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

