Virat Kohli | భారత క్రికెట్లో ఒకేఒక్కడు.. వరుసపెట్టి సచిన్ రికార్డులను బ్రేక్ చేస్తున్న కోహ్లీ
Virat Kohli : వన్డే వరల్డ్ కప్లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న భారత్ దర్జాగా సెమీస్లో అడుగుపెట్టింది. వాంఖడేలో శ్రీలంకపై అద్భుత అర్థ శతకం బాదిన విరాట్ కోహ్లీ(Virat Kohli) వరుసపెట్టి సచిన్ టెండూల్కర్ (Schin Tendulkar) రికార్డు బద్ధలు కొడుతున్నాడు. ఈ ఏడాది వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న విరాట్..
Virat Kohli : వన్డే వరల్డ్ కప్లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న భారత్ దర్జాగా సెమీస్లో అడుగుపెట్టింది. వాంఖడేలో శ్రీలంకపై అద్భుత అర్థ శతకం బాదిన విరాట్ కోహ్లీ(Virat Kohli) వరుసపెట్టి సచిన్ టెండూల్కర్ (Schin Tendulkar) రికార్డు బద్ధలు కొడుతున్నాడు. ఈ ఏడాది వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న విరాట్.. మొత్తంగా 8 సార్లు ఈ ఫీట్ సాధించాడు. దాంతో, ఏడు పర్యాయాలు 1,000 పరుగుల మార్క్ దాటిన సచిన్ను అధిగమించాడు. శ్రీలంకపై భారత జట్టు భారీ విజయంతో రన్ మెషిన్ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు సాధించిన అత్యధిక విజయాల్లో భాగమైన తొలి ప్లేయర్గా కింగ్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. తద్వారా భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకూ టీమిండియా గెలిచిన 308 మ్యాచుల్లో కోహ్లీ ఆడగా.. సచిన్ 307 మ్యాచుల్లో ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాల రికార్డు మాత్రం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉంది. ప్రపంచ క్రికెట్లో గొప్ప ప్లేయర్, సారథిగా నిలిచిపోయిన పాంటింగ్ ఆసీస్ జట్టు సాధించిన 377 విజయాల్లో భాగమయ్యాడు.
ఇవి కూడా చదవండి
టికెట్ల అమ్మకాలలో మా పాత్ర లేదు: గంగూలీ
టీపీజీఎల్ సెమీస్లో వారియర్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

