Virat Kohli : పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) అదే ఉత్సాహంతో రెండో ట్రోఫీపై కన్నేసింది. పంతొమ్మిదో సీజన్ సన్నాహకాలను ఇప్పటికే ప్రారంభించిన ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టనుంది. ఇంకేముంది.. నిరుడు లెక్కనే చెలరేగిపోవాలని బెంగళూరు ఫ్రాంచైజీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) సహచరలను ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేశాడు.
ఐపీఎల్ 19వ సీజన్ మినీ వేలంలో ఆర్సీబీ కొన్న ఆటగాళ్లంతా స్క్వాడ్‌లో చేరారు. ఈ సందర్భంగా యాజమాన్యం, కోచ్ ఆండీ ఫ్లవర్ వారికి స్వాగతం పలికారు. అనంతరం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వారితో మాట్లాడి.. ఎప్పటిలానే తన స్టయిల్లో స్ఫూర్తి రగిలించాడు. ఆర్సీబీ సన్నద్ధత గురించి మాట్లాడిన విరాట్ ఈసారి తమకు ఎదురయ్యే సవాళ్లనువివరించాడు. ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నందున ఈసారి ఆర్సీబీకి కఠిన సవాళ్లు ఎదురవుతాయని.. మరింతగా కష్టపడాల్సిందేనని విరాట్ అన్నాడు.
Virat Kohli sets the tone ahead of RCB’s IPL defence 😤 pic.twitter.com/3YbKA22xf3
— ESPNcricinfo (@ESPNcricinfo) March 21, 2026
‘గత రెండు మూడు సీజన్లుగా మేము ఎంతో శ్రమించాం. ఆ కష్టానికి ఫలితంగా నిరుడు పీఎల్ ట్రోఫీని సాధించాం. పంతొమ్మిదో సీజన్ మనకు చాలా కఠినంగా ఉండనుంది. ఎందుకంటే.. డిఫెండింగ్ ఛాంపియన్లమైన మనల్ని ఓడించేందుకు అన్ని జట్లు తమవైన వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి. సో.. మనం ఈ కీలకమైన రోజులను వృథా చేయొద్దు. మనం అందరికంటే ముందుండాలి. కాబట్టి.. అందరూ సిద్ధంగా ఉండండి. మనం ఆర్సీబీలో ఆడినంతకాలం ఒక్క నిమిషం కూడా వృథా చేయవద్దు. ఈ రెండున్నర నెలలు మనంత 120 శాతం కష్టపడ్డాలి. ఛాలెంజర్స్‌గా మనం గర్వపడుతున్నామనేది ప్రతి ఒక్కరి ముఖంలో స్పష్టంగా కనిపించాలి’ అని కోహ్లీ సహచరులను చైతన్యం చేసిన వీడియోను ఫ్రాంచైజీ ఎక్స్‌లో పెట్టింది.
🚨 VIRAT KOHLI’S BIG WARNING FOR RCB TEAMMATES 🚨
Virat Kohli said – “Things will be tougher this year in IPL 2026. We need to be mentally stronger than ever if we want to reach the top and win that trophy!” pic.twitter.com/RmFcrCrQsA
— Sam (@Cricsam01) March 21, 2026
ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీకి మాత్రమే ఆడుతున్న కోహ్లీ ఎట్టకేలకు నిరుడు తన కలను సాకారం చేసుకున్నాడు. సారథిగా తన వల్ల కాకున్నా.. రజత్ పాటిదార్ నేతృత్వంలో చెలరేగి ఆడిన విరాట్ 18 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాడు. తొలి సీజన్ నుంచి నిలకడగా రాణిస్తున్న అతడు 8 శతకాలతో, 63 అర్ధ శతకాలతో ఐపీఎల్ కింగ్‌గా అవతరించాడు. ఇప్పటివరకూ 267 మ్యాచుల్లో 8,661 పరుగులు చేసిన విరాట్ ..9 వేల పరుగులకు చేరువలో ఉన్నాడు. మార్చి 28న జరుగనున్న ఆరంభ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బెంగళూరు తలపడనుంది.
𝑫𝒂𝒚 1️⃣. 𝑾𝒐𝒓𝒌 𝒎𝒐𝒅𝒆 🔛. ❤️🔥
Head Coach Andy Flower’s welcome to the new members of the squad, and Virat’s pep talk in the first practice session of #IPL2026 at ನಮ್ಮ Chinnaswamy. 👊
Watch more on @bigbasket_com presents RCB Bold Diaries. 🎥#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/ee8mPnIgWb
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 20, 2026