చెన్నై: చెన్నై గ్రాండ్ మాస్టర్స్‌లో జర్మనీ ఆటగాడు విన్సెంట్ కెమెర్ జోరు కొనసాగుతున్నది. సోమవారం జరిగిన ఐదో రౌండ్లో కెమెర్.. భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీతో గేమ్‌ను డ్రా చేసుకున్నా పాయింట్ల పట్టికలో అతడు 4 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.
తొలి మూడు రౌండ్లలో రెండు విజయాలతో మెరిసి నాలుగో రౌండ్లో ఓడిన టాప్ సీడ్ అర్జున్ ఇరిగేసి.. భారత్‌కే చెందిన ప్రణవ్‌తో ఆడిన ఐదో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఒకదశలో ప్రణవ్.. తెలంగాణ కుర్రాడికి గట్టిపోటీనిచ్చినా అతడు డ్రాతో గట్టెక్కాడు. ఈ డ్రాతో అర్జున్.. 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచాడు.