MS Dhoni | టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోనీని ఫ్యాన్స్ ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు. ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడ కనిపించినా ఆటోగ్రాఫ్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ధోనీ తన అభిమానికి షర్ట్‌పై ఆటోగ్రాఫ్ ఇస్తూ కనిపించాడు. ఇది చూసిన అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఆటో గ్రాఫ్ తీసుకున్న వ్యక్తిని ‘భయ్యా.. నువ్వు చాలా లక్కీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ధోనీ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత టీ20 లీగ్‌లో చెన్నై సారథిగా మాత్రమే కొనసాగుతున్నారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోనీ.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అప్పుడప్పుడూ వెకేషన్స్‌కు కూడా వెళ్తూ సేదతీరుతున్నారు.
One Lucky fan gets autograph on shirt by MS Dhoni 🥵🔥
Me when @msdhoni 🥺?#MSDhoni pic.twitter.com/nIf9IPdY0Q
— DHONI Empire™ (@TheDhoniEmpire) December 11, 2022