Pele Health | మరింతగా విషమించిన పీలే ఆరోగ్యం
Pele Health | ఫుట్‌బాల్ మాంత్రికుడిగా పేరుగాంచిన పీలే ఆరోగ్య పరిస్థితి విషమంగా తయారైంది. కుటుంబీకులు, సన్నిహితులు ఆయన చికిత్స పొందుతున్న దవాఖానకు చేరుకున్నారు. కుమారుడు ఎడిన్మో, కుమార్తె కెల్లీ నాసిమెంటో ఆయనతోనే ఉన్నారు.
Pele Health | ఫుట్‌బాల్ ఆల్ టైమ్ గ్రేట్ పీలే ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది. గొప్ప బ్రెజిలియన్ ఫుట్‌బాల్ ఆటగాడిగా పేరుగాంచిన పీలే.. ప్రస్తుతం సావో పాలో దవాఖానలో మృత్యువుతో పోరాడుతున్నాడు. వైద్యులు ఆయనను ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. అతని ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తున్నదని, ఇది మూత్రపిండాలు, గుండెపై ప్రభావం చూపుతున్నదని వైద్యులు చెప్తున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న 82 ఏండ్ల వెటరన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిని చూసేందుకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు దవాఖానకు వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు క్రిస్మస్ వేడుకలను హాస్పిటల్లోనే జరుపుకున్నారు.
ఆదివారం ఉదయం పీలే కుమార్తె కెల్లీ నాసిమెంటో ఇన్‌స్టాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. క్రిస్మస్ సందర్భంగా తమ తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమకు ధన్యవాదాలు. ఈ ఆహ్లాదకరమైన, అద్భుతమైన జీవితంలో పీలే లేకుండా నేను ఏమీ కాదు అని నాసిమెంటో పోస్టులో రాశారు. ఇదే సమయంలో పీలే కుమారుడు ఎడిన్హో ఇన్‌స్టాగ్రాంలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టాడు. ‘పాపా… నువ్వే నా బలం’ అంటూ తండ్రితో ఉన్న చిన్నానాటి ఫొటోను షేర్ చేశాడు. ఈయన నిన్ననే దవాఖానకు చేరుకోగా కుమార్తె కెల్లీ నాసిమెంటో ఇప్పటికే హాస్పిటల్లో ఉన్నారు.
రొటీన్ చెకప్ కోసం పీలే దవాఖానలో చేరిన పీలేకు క్రమంగా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. పీలేకు గుండె సంబంధ సమస్యలు ఉన్నాయి. కీమోథెరపీ చికిత్సకు స్పందించకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దప్రేగు కణితిని గత ఏడాది సెప్టెంబర్‌లో తొలగించారు. ఆ తర్వాత అతడికి కీమోథెరపీ జరిగింది. గతంలో పీలే చాలాసార్లు ఆసుపత్రి పాలయ్యాడు.
ఫీఫా ప్రపంచ కప్ ప్రారంభం సందర్భంగా పీలే తన ఇన్స్టాగ్రాం హ్యాండిల్లో ఒక ఫొటోను పోస్ట్ చేసి.. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు.. తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

