Wimbledon | వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో అమెరికన్లకు షాక్.. తొలి రౌండ్లో ఓడిన వీనస్ విలియమ్స్, కోకో గాఫ్
Wimbledon | వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అమెరికా ప్లేయర్లకు తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. రికార్డు స్థాయిలో 24వ సారి ఆల్ ఇంగ్లండ్ సెంటర్ కోర్టులో అడుగుపెట్టిన అమెరికా వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్.. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పరాజయం పాలవ్వగా.. యంగ్ గన్ కోకో గాఫ్ అనామక ప్లేయర్ చేతిలో ఓడింది.
Wimbledon | వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అమెరికా ప్లేయర్లకు తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. రికార్డు స్థాయిలో 24వ సారి ఆల్ ఇంగ్లండ్ సెంటర్ కోర్టులో అడుగుపెట్టిన అమెరికా వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్.. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పరాజయం పాలవ్వగా.. యంగ్ గన్ కోకో గాఫ్ అనామక ప్లేయర్ చేతిలో ఓడింది.
43 ఏండ్ల వయసులో మైదానంలోకి అడుగుపెట్టిన వీనస్‌కు ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వగా.. ఎలినా స్వితాలినాతో పోరులో వీనస్ మునుపటి దూకుడు కనబర్చేందుకు ప్రయత్నించింది. బిగ్ సర్వ్‌లు, క్రిస్ప్ స్ట్రోక్స్‌తో పాత వీనస్‌ను తలపించింది. అయితే కోర్టులో ఎక్కువ గడ్డి ఉండటంతో పదే పదే జారిన వీనస్ విలియమ్స్.. ఓ సారి కిందపడింది. దీంతో ఆమె కుడి కాలికి గాయమైంది. రెండుసార్లు ఫిజియో సహాయం తీసుకున్న వీనస్ చివరకు 4-6, 3-6తో స్వితోలినా చేతిలో పరాజయం పాలైంది. వీనస్ తొలిసారి (1997) వింబుల్డన్ మైదానంలో అడుగుపెట్టినప్పుడు స్వితోలినా కేవలం రెండేండ్ల చిన్నారిగా ఉండటం గమనార్హం.

Venus Williams1
మ్యాచ్ అనంతరం స్వితోలినా మాట్లాడుతూ.. ‘వీనస్‌తో పోటీపడటమే గొప్ప విషయం. నాలాంటి ఎందరో యువ ఆటగాళ్లు టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు స్ఫూర్తి ఆమెనే’ అని పేర్కొంది. గతంలో ప్రపంచ నంబర్‌వన్‌గా వెలుగొందిన వీనస్ విలియమ్స్ ప్రస్తుతం టాప్-500 ర్యాంకుల్లోనూ చోటు దక్కించుకోలేకపోయినా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వింబుల్డన్ బరిలో దిగింది.
గాఫ్‌కు చుక్కెదురు..
వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ బాటలోనే.. దూసుకొస్తున్న అమెరికా యువ సంచలనం కోకో గాఫ్‌కు వింబుల్డన్ తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన గాఫ్ 4-6, 6-4, 2-6తో ప్రపంచ 128వ ర్యాంకర్ సోఫియా కెనిన్ చేతిలో ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

