మూల్యం చెల్లించుకుంటారు.. అమెరికాకు చైనా వార్నింగ్

బీజింగ్: వచ్చే ఏడాది చైనాలోని బీజింగ్‌లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌ను అమెరికా బాయ్‌కాట్ చేసింది. దీనిపై డ్రాగన్ దేశం చైనా రియాక్ట్ అయ్యింది. అమెరికా చేపట్టిన దౌత్యపరమైన బహిష్కరణను చైనా ఖండించింది. దీనిపై ప్రతీకారం తీర్చుకోనున్నట్లు కూడా చైనా హెచ్చరించింది.
ఆ దేశ విదేశాంగ మంత్రి జావో లిజియాన్ ఈ అంశం గురించి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తాము కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, కానీ వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించబోమన్నారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న ఆరోపణలపై దౌత్యవేత్తలను ఆ దేశానికి పంపేందుకు అమెరికా నిరాకరించింది.
కానీ తమ దేశ అథ్లెట్లు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు అమెరికా చెప్పింది. అయితే క్రీడల్లో రాజకీయానికి అమెరికా తెరలేపుతోందని చైనా మంత్రి జావో ఆరోపించారు. అబద్ధాలు, అసత్యాల ఆధారంగా తమల్ని అమెరికా బాయ్‌కాట్ చేస్తోందని చైనా ఆరోపిస్తోంది. ఇటీవల రెండు అగ్ర దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. చైనాలో ఉలిగర్ ముస్లింలపై ఊచకోతకు చైనా పాల్పడుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

