CSK vs LSG | చెపాక్‌లో ఉర్విల్ ఊచకోత.. ఎనిమిదో ఓటమితో లక్నో ఔట్..!
CSK vs LSG : లీగ్ దశ ఆఖర్లో గొప్పగా ఆడుతున్న సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్.. భారీ లక్ష్యాన్ని ఉఫ్‌మనిపించింది. చెపాక్‌లో ఉర్విల్ పటేల్(65) రికార్డు అర్ధ శతకంతో మెరవగా.. లక్నో సూపర్ జెయింట్స్‌పై సీఎస్కే 5 వికెట్లతో జయభేరి మోగించింది.
CSK vs LSG : లీగ్ దశ ఆఖర్లో గొప్పగా ఆడుతున్న సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్(CSK).. భారీ లక్ష్యాన్ని ఉఫ్‌మనిపించింది. చెపాక్‌లో ఉర్విల్ పటేల్(65) రికార్డు అర్ధ శతకంతో మెరవగా.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై సీఎస్కే 5 వికెట్లతో జయభేరి మోగించింది. 204 పరుగుల ఛేదనలో లక్నో బౌలర్ల భరతం పట్టిన ఉర్విల్.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(42)తో గెలుపు తోవలో నడిపాడు. కానీ.. మిడిల్ ఓవర్లలో షాదాబ్, దిగ్వేశ్ రథీల విజృంభణతో మ్యాచ్ లక్నోవైపు మళ్లింది. కానీ, డెత్ ఓవర్లలో ఇంప్యాక్ట్ సబ్ ప్రశాంత్ వీర్(18 నాటౌట్), శివం దూబే(15 నాటౌట్)లు కళ్లుచెదిరే సిక్సర్లతో లక్నో ఆశల్ని ఆడియాసలు చేశారు.
పసుపు జెర్సీలతో నిండిపోయిన చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ విజయ గర్జన చేసింది. బౌలర్లు ప్రత్యర్థికి భారీ స్కోర్ సమర్పించిన చోట.. కుర్రాడు ఉర్విల్ పటేల్(65 : 23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా విరుచుకుపడగా లక్నో బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఆఖర్లో ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. డెత్ ఓవర్లలో ఇంప్యాక్ట్ సబ్ ప్రశాంత్ వీర్(18 నాటౌట్), శివం దూబే(15 నాటౌట్)లు ఒత్తిడికి లోన్వకుండా చెన్నైకి 5 వికెట్ల విజయాన్ని కట్టబెట్టారు. ఆరో విక్టరీతో 12 పాయింట్లు సాధించిన చెన్నై.. టాప్-5లో నిలిచింది. 11 మ్యాచుల్లో ఎనిమిదింటా ఓడిన లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది.
A lion who played for the pride.
A son who played for his father.
A roar for the history books! 💛#WhistlePodu #CSKvLSG pic.twitter.com/xBOhOR76aI— Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2026
లక్నో నిర్దేశించిన భారీ ఛేదనను ఓపెనర్ శాంసన్(28)ను ధాటిగా ఆరంభించాడు. బౌండరీలో చెలరేగిన సంజూను దిగ్వేశ్ రథీ బౌల్డ్ చేసి తొలి వికెట్ అందించాడు. అవేశ్ ఖాన్‌ను వణికించిన ఉర్విల్ పటేల్(65) చివరి మూడు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపగా 5 ఓవర్లకే చెన్నై స్కోర్ డెబ్బై దాటింది. ఆ తర్వాతి ఓవర్లో దిగ్వేష్‌ను వదలని ఉర్విల్.. మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. వరసగా రెండు ఓవర్లలో 25 చొప్పున రన్స్ రావడంతో పవర్ ప్లేలో సీఎస్కే వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
A record knock 🤯
A memorable celebration with a 𝗵𝗲𝗮𝗿𝘁𝗳𝗲𝗹𝘁 𝗺𝗲𝘀𝘀𝗮𝗴𝗲 🥹🫶Urvil Patel, thank you for the entertainment today 💛
Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @ChennaiIPL pic.twitter.com/GjR5D2sYid
— IndianPremierLeague (@IPL) May 10, 2026
పవర్ ప్లే తర్వాత సింగిల్‌తో 13 బంతుల్లోనే ఉర్విల్ అర్ధ శతకంతో రికార్డు నెలకొల్పాడు. ఆదే ఊపులో.. ఆడిన అతడు.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(42)తో చెన్నైని గెలుపు దిశగా నడిపాడు. షాదాబ్ ఓవర్లో అవేశ్ చేతికి చిక్కడంతో ఉర్విల్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అప్పటికే సగం లక్ష్యం కరిగిపోవడంతో చెన్నైకి భారీ విజయం పక్కా అనిపించింది. కానీ, షాదాబ్ ఓవర్లో గైక్వాడ్ బౌల్డవ్వగా.. బ్రెవిస్(10)ను రథీ బౌల్డ్ చేశాడు. ఫామ్‌లో ఉన్న కార్తిక్ శర్మ(20)ను అవేశ్ పెవిలియన్ పంపడంతో ఇంప్యాక్ట్ సబ్‌గా ప్రశాంత్ వీర్(18 నాటౌట్) వచ్చాడు. 18 బంతుల్లో 30 రన్స్ అవసరమవ్వగా.. ప్రిన్స్ 9 రన్సే ఇవ్వడంతో ఉత్కంఠ మొదలైంది. రథీ, పూరన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ప్రశాంత్ రెండు సిక్సర్లతో మెరవగా.. మర్క్రమ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో శివం దూబే(15 నాటౌట్) తొలి రెండు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో 5 వికెట్లతో గెలుపొందిన సీఎస్కే 12 పాయింట్లతో ప్లే ఆప్స్ రేసులోకి దూసుకొచ్చింది.
రెచ్చిపోయిన ఇంగ్లిస్
పంతొమ్మిదో సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో లేని లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్(85) అర్ధ శతకంతో భారీ స్కోర్‌కు పునాది వేశాడు. కానీ, ఓవర్టన్(3-36), అన్షుల్ కంబోజ్(2-47)లు వికెట్ల వేటతో మిడిలార్డర్‌కు బ్రేకులు వేశారు. షాదాబ్ అహ్మద్(43 నాటౌట్), హిమ్మత్ సింగ్(17) డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడి స్కోర్ రెండొందలు దాటించారు. ఒకదశలో 230 ప్లస్ కొట్టేలా కనిపించినా చివరకు వీరిద్దరి కృషి ఫలితంగా లక్నో 203కు పరిమితమైంది.
జోష్ ఇంగ్లిస్(85)

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

