సియాటెల్: ఫిఫా ప్రపంచకప్‌లో డ్రాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఫలితం తేలలేదు. రెండు సార్లు చాంపియన్ ఉరుగ్వే, యూరోప్ మేటి జట్టు బెల్జియం కూడా మెగా టోర్నీని నిరాశతో షురూ చేశాయి. గ్రూప్-హెచ్ ఆరంభ మ్యాచ్‌లో ఉరుగ్వేను సౌదీ అరేబియా ఓడించినంత పని చేసింది. హోరాహోరీగా సాగిన ఈ పోరు 1-1తో సమంగా ముగిసింది. ఆట 41వ నిమిషంలో సౌదీ ప్లేయర్ అబ్దుల్లా అల్ అమ్రి గోల్ చేసి తమ జట్టుకు ఊహించని ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఉరుగ్వే గోల్ కోసం ఏకంగా 28 సార్లు దాడులు చేసినప్పటికీ, సౌదీ కీపర్ మహమ్మద్ అల్ ఒవైస్ అద్భుతమైన సేవ్‌లతో అడ్డుగోడలా నిలిచాడు. చివరికి 80వ నిమిషంలో ఉరుగ్వే ఫార్వర్డ్ మాక్సీ అరాజో గోల్ సాధించడంతో ఆ జట్టు ఓటమి నుంచి తప్పించుకుంది.
గ్రూప్-జిలో భాగంగా ఈజిప్ట్‌తో పోరును బ్రెజిల్ 1-1తో డ్రా చేసుకుంది. ఆట 20వ నిమిషంలో ఈజిప్ట్ మిడ్‌ఫీల్డర్ ఎమామ్ అషోర్ గోల్ సాధించి తన జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అయితే సెకండాఫ్‌లో బెల్జియం స్టార్ లుకాకు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన 23 సెకన్లలోనే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో లుకాకును అడ్డుకునే ప్రయత్నంలో ఈజిప్ట్ డిఫెండర్ మొహమ్మద్ హనీ (66వ నిమిషం) ఓన్ గోల్ చేయడంతో బెల్జియం స్కోరు సమమైంది. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో రాజకీయ ఉద్రిక్తతల నడుమ బరిలోకి దిగిన ఇరాన్ 2-2తో న్యూజిలాండ్‌ను నిలువరించింది. కాగా, మ్యాచ్ ముగిసిన వెంటనే అమెరికాను వెడిచి వెళ్లిపోవాలని అగ్రరాజ్యం తమపై ఒత్తిడి చేసిందని ఇరాన్ కోచ్ ఆరోపించాడు.
అర్జెంటీనా x అల్జీరియా
ఉ. 6.30 నుంచి
ఆస్ట్రియా x జోర్డాన్
ఉ. 9.30 నుంచి
పోర్చుగల్ x కాంగో
రా. 10.30 నుంచి
ఇంగ్లండ్ x క్రొయేషియా
అ.రా. 1.30 నుంచి