MI vs UPW : యూపీ వారియర్స్ (UP Warriorz) ఓపెనర్ అలిసా హేలీ(50) వరుసగా రెండో హాఫ్ సెంచరీ కొట్టింది. 36 బంతుల్లోనే ఆమె ఫిఫ్టీకి చేరువైంది. తహ్లియా మెక్‌గ్రాత్ (38) కూడా ధాటిగా ఆడుతోంది. మూడో వికెట్‌కు వీళ్లు 40 బంతుల్లో 55 పరుగులు జోడించారు. దాంతో, ఆ జట్టు 13 ఓవర్లుకు రెండు వికెట్ల నష్టానికి 113 రన్స్ చేసింది. కిరణ్ నవ్గరే(17) రెండో వికెట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత హేలీతో జత కలిసిన మెక్‌గ్రాత్ బౌండరీలతో ముంబై ఇండియన్స్ బౌలర్లపై విరుచుకుపడింది.
సాయిక్ వేసిన నాలుగో ఓవర్లో హేలీ రెచ్చిపోయింది. నాలుగు బౌండరీలు కొట్టింది. దాంతో, ఆ ఓవర్లో 18 రన్స్ వచ్చాయి. 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ దేవికా వైద్య(6)ను ముంబై ఇండియన్స్ స్పిన్నర్ సాయిక్ ఇషక్ ఎల్బీగా ఔట్ చేసింది.