RCB vs UPW : యూపీ వారియర్స్ (UP Warriorz) కెప్టెన్ అలిసా హేలీ (66) వేగంగా హాఫ్ సెంచరీ బాదింది. కేవలం 29 బంతుల్లోనే ఆమె ఫిఫ్టీ కొట్టింది. ఈ లీగ్‌లో ఆమె తొలి ఫిఫ్టీ నమోదు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ దేవికా వైద్యా (16)తో కలిసి తొలి వికెట్‌కు 97 రన్స్ జోడించింది. హేలీ, దేవికా గ్యాప్స్‌లో బౌండరీలు కొడుతూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. పవర్‌ప్లేలో యూపీవారియర్స్ వికెట్ నష్టపోకుండా 55 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 66 బంతుల్లో 42 పరుగులు కావాలి.