RCB vs UPW : స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్(UP Warriorz)కు శుభారంభం లభించింది. ఓపెనర్లు అలిసా హేలీ (38), దేవికా వైద్యా (16) దూకుడుగా ఆడుతున్నారు. వీళ్లు గ్యాప్స్‌లో బౌండరీలు కొడుతూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. శ్రేయాంక పాటిల్ (shreyanka patil) వేసిన ఆరో ఓవర్లో హేలీ రెచ్చిపోయింది. వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు కొట్టింది. దాంతో పవర్‌ప్లేలో యూపీ జట్టు వికెట్ నష్టపోకుండా 55 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 84 బంతుల్లో 84 పరుగులు కావాలి.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 138 రన్స్‌కు ఆలౌట్ అయింది. శుభారంభం దక్కినా భారీ స్కోర్ చేయలేకపోయింది. ఎలిసే పెర్రీ (52) హాఫ్ సెంచరీతో జట్టను ఆదుకుంది. సోఫీ డెవినే (36) ధాటిగా ఆడిన ఎక్కువ సేపు నిలవలేకపోయింది.