DC vs UPW : భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ కష్టాల్లో పడింది. మూడో వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో లేని ఓపెనర్ షెరావత్ (1) ఔట్ అయింది. తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తీ శర్మ క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్లో ఆ జట్టును జొనాసెన్ దెబ్బకొట్టింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ అలిసా హేలీ (24), గత మ్యాచ్‌లో ఫిఫ్టీ కొట్టిన కిరణ్ నవ్‌గిరే(0)ను పెవిలియన్ పంపింది. జొనాసెన్ ఓవర్లో తొలి బంతికి ఫోర్ కొట్టిన హేలీ రెండో బంతికి షాట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకుంది. కిరణ్ లాంగాఫ్‌లో భారీ షాట్ ఆడి ఔట్ అయింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్ల నష్టానికి 211 రన్స్ చేసింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మేగ్ లానింగ్ (70) అర్ధ శతకంతో చెలరేగింది. జెమీమా రోడ్రిగ్స్ (34), జెస్ జొనాసెన్ (42) చివర్లో ధాటిగా ఆడారు. దాంతో, ఆ జట్టు 200 ప్లస్ స్కోర్ చేయగలిగింది.