MI vs UPW : టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన యూపీ వారియర్స్(UP Warriorz) తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ దేవికా వైద్య(6)ను ముంబై ఇండియన్స్ స్పిన్నర్ సాయిక్ ఇషక్ (Saika Ishaque) ఎల్బీగా ఔట్ చేసింది. దాంతో, ఆ జట్టు 8 పరుగుల వద్ద మొదటి వికెట్ పడింది. ఓపెనర్ అలిసా హేలీ(2), కిరణ్ నవ్గరే క్రీజులో ఉన్నారు. రెండు ఓవర్లకు ఆ జట్టు వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్ వేసిన తొలి ఓవర్లో రెండు రన్స్ వచ్చాయంతే.