UP vs GG : గుజరాత్ జెయింట్స్ ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఆషే గార్డ్నర్ (25) స్టంపౌట్ అయింది. దీప్తి శర్మ ఓవర్లో ఫ్రంట్‌ఫుట్ వచ్చి వికెట్ సమర్పించుకుంది. యూపీ వారియర్స్ బౌలర్ ఎక్లెస్టోన్ కీలకమైన రెండు వికెట్లు తీసింది. హర్లీన్ డియోల్ (29), దయలాన్ హేమలత (1) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు సబ్బినేని మేఘన (24), సోఫియా డంక్లే (13) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. అన్నాబెల్ సౌథర్లాండ్ (8), సుష్మా వర్మ (8) విఫలం అయ్యారు. గుజరాత్ 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ డంక్లేను దీప్తి శర్మ బౌల్డ్ చేసింది. 16 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోర్.. 123/5.