Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
Srilanka Cricket : ముక్కోణపు వన్డే సిరీస్ ఆరంభానికి ముందే శ్రీలంక (Srilanka)కు బిగ్ షాక్. పాకిస్థాన్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి ఆ జట్టు స్టార్ ఓపెనర్ పథుమ్ నిశాంక (Pathum Nissanka) దూరమయ్యాడు.
Srilanka Cricket : ముక్కోణపు వన్డే సిరీస్ ఆరంభానికి ముందే శ్రీలంక (Srilanka)కు బిగ్ షాక్. పాకిస్థాన్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి ఆ జట్టు స్టార్ ఓపెనర్ పథుమ్ నిశాంక (Pathum Nissanka) దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోనందుకు అతడు సిరీస్ ఆరంభానికి ముందే వైదొలిగాడు. దాంతో, అతడి స్థానంలో అన్క్యాప్డ్ లహిరు ఉడారను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో కంగుతిన్న శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందే కీలక ఆటగాడి సేవల్ని కోల్పోయింది లంక. ఓపెనర్‌గా శుభారంభాలు ఇస్తాడని ఆశించిన పథుమ్ నిశాంక ఈ టోర్నీలో ఆడడం లేదు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడికి వైద్యులు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడమే అందుకు కారణం. మూడు దేశాలు తలపడిన టీ20 సిరీస్‌లో గాయపడిన నిశాంక ఇంకా కోలుకోలేదు.
Sri Lanka Tour of Pakistan 2026
Pathum Nissanka will not join Sri Lanka’s ODI squad for the upcoming Tri-Nation Series, involving Pakistan and England, as he has yet to receive medical clearance to return to play.
Nissanka sustained a left hamstring injury during Sri Lanka’s recently concluded tour of England.
Lahiru Udara has been named as his replacement in the ODI squad.
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 15, 2026
అక్టోబర్ 18 నుంచి సిరీస్ మొదలు కానున్న నేపథ్యంలో అతడికి వైద్యులు మెడికల్ ఫిట్నెస్ ధ్రువపత్రం ఇవ్వలేదు. దాంతో.. అతడి స్థానంలో టెస్టుల్లో రాణిస్తున్న లహిరు ఉడార స్వ్వాడ్లోకి ఎంపికయ్యాడు. అయితే.. పాక్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు సైతం నిశాంక ఎంపికయ్యాడు. నవంబర్ 9 నుంచి మొదలయ్యే రెడ్ బాల్ క్రికెట్ పోరులోపు అతడు కోలుకొని, ఫిట్‌గా మారాలని లంక క్రికెట్ ఆశిస్తోంది. ఉడార విషయానికిస్తే.. అతడికి అంతర్జాతీయంగా ఇప్పటివరకు ఐదు టెస్టులు, ఏడు టీ20లు ఆడిన అనుభవం మాత్రమే ఉంది.
శ్రీలంక వన్డే స్క్వాడ్ : కుశాల్ మెండిస్(కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, కమిందు మెండిస్, జనిత్ లియనగే, పవన్ రత్ననాయకే, సహన అరచ్చిగే, దసున్ శనక, కమిల్ మిషార(వికెట్ కీపర్), లహిరు ఉడార, దునిత్ వెల్లలాగే, థీక్షణ, సచిందు కొలొంబగే, చమీర, అసితా ఫెర్నాండో, మదుశనక, ఇషాన్ మలింగ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

