కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత్‌కు షాక్.. డోపింగ్ టెస్టులో ఫెయిలైన ఇద్దరు టాప్ అథ్లెట్స్
కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత్‌కు షాక్ తగిలింది. ఇద్దరు టాప్ అథ్లెట్లు డోపింగ్ టెస్టులో ఫెయిలయ్యారు. వారిలో స్ప్రింటర్ ఎస్. ధనలక్ష్మి ఒకరు కాగా, స్టార్ ట్రిపుల్ జంపర్ ఐశ్వర్యా బాబు మరొకరు. వీళ్లిద్దరూ డోపింగ్ టెస్టులో ఫెయిలవడంతో బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనడం లేదని సమాచారం.
భారత అథ్లెటిక్స్ బృందంలో ఉన్న వీళ్లిద్దరూ కూడా కామన్వెల్త్ క్రీడలకు దూరమైనట్లే. ధనలక్ష్మికి విదేశాల్లో అథ్లెటిక్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు సమాచారం. కామన్వెల్త్ క్రీడల్లో స్ప్రింటర్ ధనలక్ష్మి 100 మీటర్ల పరుగు పందెంతోపాటు 4×100 మీటర్ల రిలే రేస్‌లో కూడా పాల్గొనాల్సి ఉంది.
అదే సమయంలో నేషనల్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా సేకరించిన ఐశ్వర్య శాంపిల్స్ కూడా పాజిటివ్ ఫలితాన్నిచ్చినట్లు నాడా అధికారులు తెలిపారు. దీంతో వీళ్లిద్దరూ కూడా కామన్వెల్త్ క్రీడలకూ దూరం కానున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

