టోక్యో: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలవాలన్నది ప్రతి అథ్లెట్ కల. అలాంటి గోల్డ్ మెడల్(Gold Medal)ను మరొకరితో పంచుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం ఆ అనుకోనిదే జరిగింది. రెండు దేశాలకు చెందిన ఇద్దరు అథ్లెట్లు గోల్డ్ మెడల్‌ను పంచుకోవడానికి అంగీకరించడం విశేషం. హైజంప్ ఈవెంట్లో ఖతార్‌కు చెందిన ముతాజ్ బర్షిమ్, ఇటలీకి చెందిన గియాన్‌మార్కో తంబేరీ గోల్డ్‌ను షేర్ చేసుకున్నారు. ఈ ఇద్దరూ 2.37 మీటర్ల ఎత్తుపై నుంచి దూకారు. దీంతో అధికారులు 2.39 మీటర్ల ఎత్తు సెట్ చేశారు. అయితే ఈ ఇద్దరూ అంత ఎత్తు జంప్ చేయలేకపోయారు.
ఇలాంటి సమయంలో మీ ఇద్దరూ అంగీకరిస్తే గోల్డ్ మెడల్‌ను పంచుకునే అవకాశం ఉంటుందని అధికారులు వారికి చెప్పారు. అఫీషియల్ ఆ మాట అనడం పూర్తి కాకముందే ఖతార్ అథ్లెట్ బర్షిమ్ తాను రెడీ అని, నీకు ఓకేనా అంటూ తంబేరీని అడిగాడు. దానికి అతడు కూడా అంగీకరించడంతో ఇద్దరూ ఆనందంతో ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. పోడియంపై కూడా ఇద్దరూ గోల్డ్ మెడల్‌ను వేసుకున్నారు.
Fave moment of the Olympics so far. Barshim (Qatar) and Tamberi (Italy) were tied in the high-jump final. The official is there talking about a prospective jump-off, but Barshim asks immediately: "Can we have two golds?" One look, no words exchanged, they know they're sharing it. pic.twitter.com/E3SneYFocA
— Andrew Fidel Fernando (@afidelf) August 1, 2021