IND vs IRE : పొట్టి సిరీస్ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ బ్యాటర్లు ఆరంభంలో తడబడినా.. ఆఖర్లో దంచారు. భారత పేసర్ హర్షిత్ రానా(3-24) విజృంభణతో టాపార్డర్ కుప్పకూలగా.. లొర్కాన్ టక్నర్(50) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఐర్లాండ్‌ను ఆదుకున్నాడు. గరెత్ డెలానీ(49)తో కలిసి ఐదో వికెట్‌కు విలువైన రన్స్ జోడించాడు. పూర్తి స్థాయి సారథిగా టక్నర్ తొలి హాఫ్ సెంచరీతో రాణించగా.. టెయిలెండర్లతో డెలానీ టీమిండియా బౌలర్లను ఉతికేశాడు. ఫలితంగా ఐర్లాండ్ 182 పరుగులు చేయగలిగింది.
పొట్టి సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు పంజా విసిరినా ఐర్లాండ్ భారీ స్కోర్ కొట్టింది. టాస్ ఓడిన జట్టుకు శుభారంభమివ్వాలనుకున్న ఓపెనర్ రాస్ అడైర్(12)ను ఔట్ చేసి హర్షిత్ రానా(3-24) తొలి వికెట్ అందివ్వగా.. హ్యారీ టెక్టర్(0)ను అర్ష్‌దీప్ సింగ్(2-28) పెవిలియన్ పంపాడు. తర్వాతి ఓవర్లో టిమ్ టెక్టర్(17)ను రానా డగౌట్ చేర్చగా 30 పరుగులకే మూడు వికెట్లు పడ్డాయి. ఆ దశలో ఆచితూచి ఆడాలనుకున్న బెంజమిన్ కాలిట్జ్(15)ను దూబే బోల్తా కొట్టించాడు. కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ లొర్కాన్ టక్నర్(50), గరెత్ డెలానీ(49)లు ఆదుకున్నారు.
Clean as you like! 👌#BackingGreen | #IREvIND | #FailteSolar pic.twitter.com/PU4Qo5opro
— Cricket Ireland (@cricketireland) June 26, 2026
టపటపా నాలుగు వికెట్లు పడిన దశలో టక్నర్, డెలానీ నిలబడ్డారు. మరో వికెట్ పడకుండా.. రన్‌రేటు తగ్గకుండా స్కోర్ బోర్డును నడిపించారిద్దరూ. దూబే ఓవర్లో ఫోర్, డబుల్స్‌లో ఐరిష్ సారథి అర్ధ శతకం సాధించాడు. కానీ హర్షిత్ ఓవర్లో టక్నర్.. తిలక్ వర్మ చేతికి చిక్కడంతో 115 వద్ద ఐదో వికెట్ పడింది. డెత్ ఓవర్లలో గేర్ మార్చిన గెలానీ బౌండరీలు రాబట్టగా.. ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేయగలిగింది.
Innings Break!
3️⃣ wickets for Harshit Rana 🔥
2️⃣ wickets each for Arshdeep Singh and Axar Patel 🔝Over to our batters to chase down 1️⃣8️⃣3️⃣ 🎯
Updates ▶️ https://t.co/gdoXw2dAKR#TeamIndia | #IREvIND pic.twitter.com/TPyCKD70FF
— BCCI (@BCCI) June 26, 2026