త్రిసా-గాయత్రి జోడీదే టైటిల్.. ఉమెన్స్ డబుల్స్‌లో పతకం
సయ్యిద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో భారత మహిళల డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ టోర్నీ బరిలో నిలిచిన ఈ జోడీ.. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో 17-21, 21-13, 21-15తో కహొ ఒసావా, మై తనబె ద్వయాన్ని ఓడించింది.
- ఫైనల్లో శ్రీకాంత్‌కు నిరాశ
లక్నో : సయ్యిద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో భారత మహిళల డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ టోర్నీ బరిలో నిలిచిన ఈ జోడీ.. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో 17-21, 21-13, 21-15తో కహొ ఒసావా, మై తనబె ద్వయాన్ని ఓడించింది. గంటా 16 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికీ తర్వాత పుంజుకున్న భారత ద్వయం.. తర్వాత వరుసగా రెండు గేమ్స్‌లోనూ దూకుడుగా ఆడి ప్రత్యర్థిని చిత్తుచేసింది.
కాగా సింగిల్స్ విభాగంలో భారత పతక ఆశలు మోసిన కిడాంబి శ్రీకాంత్.. ఫైనల్స్‌లో తడబడి రన్నరప్‌గా నిలిచాడు. మెన్స్ సింగిల్స్ టైటిల్ పోరులో శ్రీకాంత్.. 16-21, 21-8, 20-22తో ప్రపంచ 59వ ర్యాంకర్ జేసన్ గునావన్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ టైటిల్ గెలిచిన శ్రీకాంత్.. 8 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని భావించిన ఫైనల్లో తడబడటంతో అతడికి మరోసారి నిరాశే మిగిలింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

