Syed Modi International | ఫైనల్లో తడబడిన శ్రీకాంత్.. టైటిల్ నిలబెట్టుకున్న త్రీసా – గాయత్రి..!
Syed Modi International : ప్రతిష్ఠాత్మక సయ్యద్ మోడీ ఇంటర్నేషన్ (Syed Modi International)లో భారత స్టార్లు త్రీసా జాలీ- గాయత్రీ గోపిచంద్ ద్వయం జయకేతనం ఎగురేసింది. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన ఈ జోడీ.. అదిరే ఆటతో టైటిల్ నిలబెట్టుకుంది.
Syed Modi International : ప్రతిష్ఠాత్మక సయ్యద్ మోడీ ఇంటర్నేషన్ (Syed Modi International)లో భారత స్టార్లు త్రీసా జాలీ – గాయత్రీ గోపిచంద్ ద్వయం జయకేతనం ఎగురేసింది. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన ఈ జోడీ అదిరే ఆటతో టైటిల్ నిలబెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ఈ జంట కహో ఒసావా- మై తనబే (జపాన్)ను చిత్తు చేసింది. మఅయితే.. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth)కు మాత్రం నిరాశే మిగిలింది.
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నమెంట్ ఫైనల్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్‌లో తమకు తిరుగులేదని చాటుతూ త్రీసా జాలీ- గాయత్రీ గోపిచంద్ టైటిల్ కొల్లగొట్టింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో జపాన్ ద్వయం కహో ఒసావా – మై తనబే జోరుకు భారత జంట తొలి సెట్లో కోల్పోయింది. కానీ, ఆ తర్వాత గొప్పగా పుంజుకున్న త్రీసా, గాయత్రి సంచలన ఆటతో వరుసగా రెండు సెట్లను 21-13, 21-15తో గెలుచుకున్నారు. వరుసగా రెండోసారి టైటిల్ సాధించి మురిసిపోయారు.
Syed Modi International S300
WD Podium
Treesa Jolly and Gayatri Gopichand Pullela 🥇
Kaho Osawa/Mai Tanabe 🥈 pic.twitter.com/1tTcDJL03N— Just Badminton (@BadmintonJust) November 30, 2025
మరోసారి నిరాశే
భారత్‌కే చెందిన మిథున్ మంజునాథన్ (Mitun Manjunathan)ను ఓడించి ఫైనల్ చేరిన శ్రీకాంత్ విజేతగా నిలవలేకపోయాడు. తనకంటే తక్కువ ర్యాంకర్ అయిన హాంకాంగ్ షట్లర్ జేసన్ గునవాన్ చేతిలో అనూహ్యంగా కంగుతిన్నాడు. తొలి సెట్‌ను 16-21తో కోల్పోయిన శ్రీకాంత్ రెండో సెట్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. అయితే.. నిర్ణయాత్మక మూడో సెట్లో జేసన్‌ను నిలువరించలేక మ్యాచ్ అప్పగించేశాడు భారత స్టార్. దాంతో.. ఎనిమిదేళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న అతడికి మరోసారి నిరాశే మిగిలింది.
Srikanth finishes runner-up at Syed Modi India International 2025!
Kidambi Srikanth showed brilliant play against Hong Kong’s🇭🇰 Jason Gunawan before losing his Men’s Singles final 16-21, 21-8, 20-22.
Well fought, champ!👏🏻#SyedModiIndiaInternational2025 #UPBadminton… pic.twitter.com/9W3KnwDzo9
— Doordarshan Sports (@ddsportschannel) November 30, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

