Travis Head | ఐసీసీ టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్.. సూర్యను దాటిన హెడ్
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యానికి ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చెక్ పెట్టాడు. ఏడాది కాలంగా టీ20లలో నిలకడైన ప్రదర్శనలతో రాణిస్తూ ఐసీసీ పురుషుల టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సూర్యను తాజాగా హెడ్ అధిగమించాడు.
Travis Head | దుబాయ్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యానికి ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చెక్ పెట్టాడు. ఏడాది కాలంగా టీ20లలో నిలకడైన ప్రదర్శనలతో రాణిస్తూ ఐసీసీ పురుషుల టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సూర్యను తాజాగా హెడ్ అధిగమించాడు.
బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకులలో 844 రేటింగ్ పాయింట్స్‌తో హెడ్ టాప్‌ర్యాంక్ కైవసం చేసుకోగా 842 పాయింట్లతో సూర్య రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. ఫిల్ సాల్ట్, బాబర్, రిజ్వాన్ టాప్-5లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో అదిల్ రషీద్ (ఇంగ్లండ్) అగ్రస్థానంలో ఉండగా ఆల్రౌండర్లలో వనిందు హసరంగ మొదటి స్థానాలను దక్కించుకున్నారు.
జింబాబ్వే టూర్ నుంచి నితీశ్ రెడ్డి ఔట్
తెలుగు యువ క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డికి భారత జట్టులో చోటు దక్కిన ఆనందం రెండ్రోజుల్లోనే ఆవిరైంది. జూలైలో జరిగే జింబాబ్వే పర్యటనకు ఎంపికైన అతడు గాయం కారణంగా ఈ టూర్ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. నితీశ్ స్థానంలో శివమ్ దూబేను జట్టులోకి ఎంపిక చేసింది. నితీశ్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడని, నాలుగు వారాల్లో కోలుకుంటాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
B Vinod Kumar | కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే కేసీఆర్ ఆమరణదీక్షకు ప్రధాన కారణం : బోయినపల్లి వినోద్ కుమార్
మరణించినట్లు రికార్డుల్లో నమోదు.. నిలిచిన పింఛన్
Governor Shiv Pratap Shukla | వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
CJP Oppose Delimitation Bill | ‘ప్రజా తీర్పుకు ఘోర ద్రోహం’.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని సీజేపీ పిలుపు
Rasamayi Balakishan | కేసీఆర్ దీక్షను తలచుకోవడం అంటే తెలంగాణ ఆవిర్భావాన్ని తలచుకోవడమే : రసమయి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

