GT vs MI : అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్ ఆరంభంలో తడబడినా గొప్పగా పుంజుకుంది. పవర్ ప్లేలోనే రబడ మూడు వికెట్లతో హడలెత్తించినా కుర్రాళ్లు తిలక్ వర్మ(101 నాటౌట్), నమన్ ధిర్(45)లు దంచేశారు. గుజరాత్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేసిన ఈ ద్వయం కీలక భాగస్వామ్యంతో ముంబైని ఆదుకుంది. నమన్ ఔటయ్యాక మరింత రెచ్చిపోయిన తిలక్ సూపర్ సెంచరీతో భారీ స్కోరందించాడు. ప్రసిధ్ వేసిన ఆఖరి ఓవర్లో ఫోర్, రెండు సిక్సర్లు బాదిన తెలుగబ్బాయి ఐపీఎల్లో శతకం కొట్టేశాడు. ఫలితంగా గుజరాత్ అడ్డాలో ముంబై భారీస్కోర్తో సవాల్ విసిరింది.
పంతొమ్మిదో సీజన్లో ఒకేఒక విజయంతో అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్‌ను పవర్ ప్లేలోనే రబడ(3-33) దెబ్బకొట్టాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న డానిష్ మలేవార్(2)ను ఎల్బీగా వెనక్కి పంపిన రబడ.. కాసేపటికే క్వింటన్ డికాక్(13) వికెట్‌తో ముంబైకి మరో షాకిచ్చాడు. సూర్యకుమార్ యాదవ్(15)ను బౌల్డ్ చేసి మూడో వికెట్‌తో గుజరాత్లో జోష్ నింపాడు. టాపార్డర్ విఫలమైనా కుర్రాళ్లు నమన్ ధిర్(45), తిలక్ వర్మ(101 నాటౌట్ 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు)లు ధనాధన్ ఆడారు. దంచేసిన ఈ ఇద్దరూ కీలక భాగస్వామ్యంతో ముంబైని ఆదుకున్నారు.
Innings Break!
A terrific hundred from Tilak Varma leads #MI’s turnaround to post 199/5 👏👏
Will #GT chase it down? 🤔
Scorecard ▶️ https://t.co/cawFoZABvQ#TATAIPL | #KhelBindaas | #GTvMI | @TilakV9 pic.twitter.com/WXIQR4PTZx
— IndianPremierLeague (@IPL) April 20, 2026
అర్ధ శతకానికి చేరువైన నమన్‌ను ప్రసిధ్ వెనక్కి పంపగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా(15) జతగా తిలక్ మరింత రెచ్చిపోయాడు. రషీద్ ఖాన్ ఓవర్లో సిక్సర్ బాది.. అనంతరం అశోక్ శర్మను వణికించాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచి ఈ సీజన్లో తొలి అర్ధ శతకం సాధించాడీ తెలుగు కుర్రాడు. ఐదో వికెట్‌కు 37 బంతుల్లో 81 పరుగులు జోడించిన ఈ ద్వయాన్ని సిరాజ్ విడదీశాడు. బౌండరీ లైన్ వద్ద ఫిలిప్స్ క్యాచ్‌తో పాండ్యా వెనుదిరిగాడు. అయినా జోరు తగ్గించని లెఫ్ట్ హ్యాండర్ ప్రసిధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రెండేసీ ఫోర్లు, సిక్సర్లతో శతకం సాధించాడు. తిలక్ మెరుపులతో ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 రన్స్ కొట్టింది.
𝗛.𝗨.𝗡.𝗗.𝗥.𝗘.𝗗 💯
Tilak Varma has lit up Ahmedabad in a blistering way 🔥
His maiden #TATAIPL century 🙇
Updates ▶️ https://t.co/cawFoZABvQ #KhelBindaas | #GTvMI | @mipaltan pic.twitter.com/uTGvjvdoBi
— IndianPremierLeague (@IPL) April 20, 2026