Tilak Varma : ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌లో దుమ్మరేపిన భారత జట్టుకు మరో గుడ్‌న్యూస్. సర్జరీ కారణంగా న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన తిలక్ వర్మ (Tilak Varma) మళ్లీ జట్టుతో కలువబోతున్నాడు. నెలకు పైగా క్రికెట్ ఆడని అతడు వరల్డ్‌కప్ వామప్ మ్యాచ్‌లో ఆడనునున్నాడు. ఈ యంగ్‌స్టర్‌కు ఆదివారం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(C0E) క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో.. ముంబైలో జట్టుతో కలువనున్న అతడు వామప్ మ్యాచ్‌లో ఆడేందుకు సిద్దమవుతున్నాడు. తిలక్ రాకతో టీమిండియా కూర్పు ఆసక్తికరంగా మారనుంది.
విజయ్ హజారే ట్రోఫీలో గాయపడిన తిలక్ వర్మకు ‘టెస్టిక్యులార్ సర్జరీ’ తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. చిన్న ఆపరేషనే అయినప్పటికీ వైద్యుల సూచన మేరకు తిలక్‌ను న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో ఆడించలేదు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకున్న అతడు.. ఫిట్నెస్ సాధిండంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో.. వరల్డ్‌కప్ సన్నద్ధతలో భాగంగా వామప్ మ్యాచ్ ఆడనున్నాడు. అంతకంటే ముందు డీవై పాటిల్ స్టేడియంలో ఫిబ్రవరి 2న ఇండియా ఏ, యూఎస్ ఏ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. అనంతరం ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్‌లోనూ ఈ చిచ్చరపిడుగు ఆడే అవకాశముంది.
Tilak Varma has been cleared by the BCCI’s Centre of Excellence to return to action 👇 https://t.co/ZCatIzfafr
— ESPNcricinfo (@ESPNcricinfo) February 1, 2026
న్యూజిలాండ్‌తో ముగిసిన పొట్టి సిరీస్‌లో ఇషాన్ కిషన్(Ishan Kishan) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తిలక్ వర్మ స్థానంలో క్రీజులోకి వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్ మెరుపు ఇన్నింగ్స్‌లతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. త్రివేండ్రంతో తన విధ్వంసం డోసు పెంచిన ఇషాన్ 42 బంతుల్లోనే శతకంతో రెచ్చిపోయాడు. మరోవైపు ఓపెనర్ సంజూ శాంసన్ 6 పరుగులతో నిరాశపరిచాడు. ఐదు మ్యాచుల్లో సంజూ టాప్ స్కోర్ 24 మాత్రమే.
Meet Ishan Kishan
– Scored 200 in ODIs
– Sidelined because of GILL
– But never did emotional posts or podcasts
– Grinded Hard in Domestic Cricket
– Scored most runs in SMAT & scored 100 in Finals
– And Ishan Kishan today completed 50 in 21 balls pic.twitter.com/V6loNDoELX— `MAN` (@SeemsOver) January 31, 2026
తిలక్ రాకతో ఇషాన్‌ను మూడో స్థానంలో ఆడిస్తారా? శాంసన్‌ను ఓపెనర్‌గా కొనసాగిస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ తిలక్‌కు మూడో స్థానంలో అవకాశమిస్తే.. సన్నాహక సిరీస్‌లో అర్ధ శతకం(76), సెంచరీతో కదంతొక్కిన ఇషాన్ ను అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు జోడీగా పంపినా పంపొచ్చు. అప్పుడు శాంసన్ బెంచ్‌కే పరిమితమవ్వడం ఖాయం. వరల్డ్‌కప్ స్క్వాడ్‌లోని వాషింగ్టన్ సుందర్ మరికొన్ని రోజుల్లో ఫిట్నెస్ టెస్టుకు హాజరవ్వనున్నాడు. భుజం గాయం కారణంగా రియాన్ పరాగ్ సైతం ఈమధ్య మ్యాచ్‌లు ఆడలేదు. పరాగ్ కూడా ఫిట్నెస్ నిరూపించుకుని జట్టుతో కలుస్తాడని మేనేజ్మెంట్ భావిస్తోంది.