హైదరాబాద్, ఆట ప్రతినిధి: పటియాలా (పంజాబ్) వేదికగా జరుగుతున్న ఆల్ఇండియా ఇంటర్ సాయ్(భారత క్రీడా ప్రాధికార సంస్థ) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మనోళ్లు అదరగొట్టారు. శుక్రవారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో యువ అథ్లెట్లు పతకాలు కొల్లగొట్టారు. బాలుర 20ఏండ్ల పైబడిన విభాగం 100మీటర్ల రేసులో షణ్ముగ శ్రీనివాస్ పసిడి పతకంతో మెరిశాడు. బాలుర 100మీటర్ల విభాగంలో షణ్ముగ శరత్ కాంస్యం దక్కించుకోగా, అదే జోరు కనబరుస్తూ 200మీటర్ల కేటగిరీలో రజతం కైవసం చేసుకున్నాడు. బాలుర అండర్-20 400మీటర్ల హర్డిల్స్‌లో తరుణ్‌కు రజతం దక్కింది. డెకాథ్లాన్ విభాగంలో యుగేందర్ వెండి పతకాన్ని ముద్దాడాడు.