తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫీసులో చోరీ
Hyderabad | హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ విషయాన్ని ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ జీపీ పాల్గుణ ధృవీకరించారు. సోమవారం
హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ విషయాన్ని ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ జీపీ పాల్గుణ ధృవీకరించారు. సోమవారం ఉదయం కార్యాలయం ఓపెన్ చేయగా, వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తెలిపారు. ఇక ట్రోఫిలు, ఆటగాళ్లకు సంబంధించిన కిట్లు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. రూ. 50 వేల విలువ చేసే ట్రోఫీలు, రూ. 10 వేల విలువ చేసే కిట్లు అదృశ్య అయ్యాయని చెప్పారు.
ఇవాళ ఉదయం ఆఫీసును క్లీన్ చేసేందుకు వచ్చిన పని వారు ఈ ఘటనను గుర్తించి తనకు సమాచారం అందించారని వెల్లడించారు. తాను ఆఫీసుకు వచ్చి చూసేసరికి ట్రోఫీలు, కిట్లు కనబడటం లేదని తెలిపారు. అనంతరం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎల్బీ స్టేడియం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

