Tennis Star love Story | సెల్ఫీతో మొదలైన ప్రేమకథ.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్ స్టార్
Tennis Star love Story : టెన్నిస్ స్టార్లకు బోలెడు మంది అభిమానులు ఉంటారు. . తమ అభిమాన ఆటగాళ్లను కొందరు ఫ్యాన్స్ పిచ్చిగా ఆరాధిస్తారు. కంటపడితే చాలు.. సెల్ఫీ ప్లీజ్ అంటూ వెంటపడతారు. అయితే.. మరికొందరైతే ఏకంగాప్రేమిస్తున్నా అని వెంటపడతారు.. ఒక అభిమాని తన ఆరాధ్య టెన్నిస్ ప్లేయర్ మనసు గెలుచుకున్నాడు. స్పెయిన్ టెన్నిస్ స్టార్ గర్బిన్ ముగురుజా(Garbiñe Muguruza) త్వరలోనే అర్ధర్ బోర్జెస్(Arthur Borges) అనే అభిమానిని పెళ్లి చేసుకోబోతోంది.
Tennis Star love Story : టెన్నిస్ స్టార్లకు బోలెడు మంది అభిమానులు ఉంటారు. . తమ అభిమాన ఆటగాళ్లను కొందరు ఫ్యాన్స్ పిచ్చిగా ఆరాధిస్తారు. కంటపడితే చాలు.. సెల్ఫీ ప్లీజ్ అంటూ వెంటపడతారు. అయితే.. మరికొందరైతే ఏకంగా ప్రేమిస్తున్నా అని వెంటపడతారు. వాళ్ల ప్రేమ ఫలిస్తుందని చెప్పలేం. కానీ, ఒక అభిమాని తన ఆరాధ్య టెన్నిస్ ప్లేయర్ మనసు గెలుచుకున్నాడు. అవును.. ఆమె అతడితో ఏడడుగులు నడిచేందుకు ఓకే చెప్పింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..? స్పెయిన్ టెన్నిస్ స్టార్ గర్బిన్ ముగురుజ(Garbiñe Muguruza). ఆమె త్వరలోనే అర్ధర్ బోర్జెస్(Arthur Borges) అనే అభిమానిని పెళ్లి చేసుకోబోతోంది. ఈరోజు వాళ్ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అనంతరం బోర్జెస్‌తో ఉన్న ఫొటోలను ముగురుజా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
న్యూయార్క్ వీధిలో..
ముగురుజ, అర్ధర్ బోర్జెస్ ప్రేమకథ ఎలా మొదలైందో తెలుసా? .. సెల్ఫీతో. అవును. 2021లో ముగురుజ యూసె ఓపెన్ ఆడేందుకు ఆమెరికా వెళ్లింది. అక్కడ న్యూయార్క్ వీధిలో బోర్జెస్‌ను మొదటిసారి చూసిందట. ‘నేను బస చేసిన హోటల్ సెంట్రల్ పార్క్‌కు దగ్గర్లో ఉంది. ఒకరోజు బోర్ కొట్టడంతో కాసేపు నడుద్దామని బయటకు వెళ్లాను. అక్కడ బోర్జెస్‌ను మొదటిసారి చూశాను. నన్ను గమనించిన అతను ఒక సెల్పీ అడిగాడు. అంతేకాదు ‘యూఎస్ ఓపెన్‌లో నీకు అదృష్టం కలిసి రావాలి’ అని అన్నాడు. నేను ఆలోచనల్లో పడిపోయా. ‘ఎంత అందంగా ఉన్నాడు’ అని నా మనసులో అనుకున్నా. అక్కడి నుంచి మా ప్రేమకథ మొదలైంది’ అని ముగురుజ చెప్పుకొచ్చింది.
మొదట ప్రపోజ్..
ఆ రోజు నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. రెండేళ్ల తర్వాత బోర్జస్ ప్రపోజ్ చేశాడు. ఆక్షణం ముగురుజ కొంచెం కంగారుపడింది. సంతోషంతో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ వెంటనే ‘ఎస్’ చెప్పింది. అలా బోర్జస్ తన అభిమాన టెన్నిస్ స్టార్‌ను పెళ్లాడబోతున్నాడు. ముగురుజా ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది. ఆమె 2016లో ఫ్రెంచ్ ఓపెన్, 2017లో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది. 15 వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించింది.
ఫ్రెంచ్ ఓపెన్(2016) ట్రోఫీతో ముగురుజ

ఇవి కూడా చదవండి
Ruturaj Gaikwad | చెన్నై ఓపెనర్ రుతురాజ్ మనసుదోచిన అమ్మాయి ఈమెనే
IPL 2023 | ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టింది వీళ్లే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

