హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ జాతీయ స్థాయిలో మరో సారి మెరిసింది. గచ్చిబౌలిలో జరుగుతున్న జాతీయ 76వ సీనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రిత్తి సోమవారం 18 నిమిషాల 9 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది.
భవ్య సచ్దేవ్, రిచా మిశ్రా వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు. ఈ చాంపియన్షిప్లో వ్రిత్తికి ఇది రెండో పతకం కావడం విశేషం. తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న టోర్నీ పురుషుల 800 మీటర్ల విభాగంలో ఆర్యాన్ నెహ్రా జాతీయ రికార్డును బద్దలు కొట్టి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.