హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటింది. కొలంబియా వేదికగా జరుగుతున్న ప్రపంచ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 100 మీటర్ల హర్డిల్స్‌లో నందిని సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.
గురువారం జరిగిన పోటీల్లో ఈ గురుకుల విద్యార్థిని 13.58 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. ఈ క్రమంలో నందిని అండర్-20 జాతీయ రికార్డు బద్దలు కొట్టడం విశేషం. హీట్-2లో బరిలోకి దిగిన నందిని వాయువేగంతో అడ్డంకులను దాటుకుంటూ గమ్యాన్ని చేరింది.