హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ జిమ్నాస్ట్ గునుకుల అంజన అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ఫ్రాన్స్‌లోని కాన్స్‌లో జరిగిన లిటిల్ స్టార్ ఇంటర్నేషనల్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ టోర్నీలో స్వర్ణం సాధించింది.
జోయ్ జిమ్నాస్టిక్స్ అకాడమీలో కోచ్ అలీసా జోయ్ వద్ద శిక్షణ పొందుతున్న అంజన రిబ్బన్ ఆపరేట్స్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆమెను తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి సోమేశ్వర్ అభినందించారు.