WFI | హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల్లో తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు హమ్జాబిన్ ఒమర్ బరిలోకి దిగుతున్నాడు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల కోసం డబ్ల్యూఎఫ్ఐ విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఒమర్‌తో పాటు ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌యాదవ్ చోటు లభించింది.
వీరిద్దరి ప్రాతినిధ్యం పట్ల కొంతమంది వ్యతిరేకత ప్రదర్శించినా జాబితాలో చోటు దక్కడంపై పలువురు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.