అగ్రస్థానంలో రవికుమార్.. జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్
హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా జరుగుతున్న జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు అదరగొడుతున్నారు. అండర్-16 అప్టిమిస్టిక్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రవికుమార్ అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా జరుగుతున్న జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు అదరగొడుతున్నారు. అండర్-16 అప్టిమిస్టిక్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రవికుమార్ అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన రేసులో ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన రవికుమార్ చిరస్మరణీయ విజయం సాధించాడు. ఇదే రేసులో రాష్ర్టానికి చెందిన నరసింహ ఓవరాల్గా రెండో స్థానంలో నిలిచాడు.
శనివారం చివరి రెండు రేసులు మిగిలి ఉన్నందున ప్రతిష్టాత్మక టైటిల్ కోసం రవికుమార్, నరసింహ మధ్య పోటీ నెలకొన్నది. అండర్-15 బాలికల విభాగంలో యువ సెయిలర్ రమీజా భాను ఓవరాల్గా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇతర విభాగాల్లో ప్రీత్ సివాల్, కౌశిక్(లేజర్), ఇంటర్నేషనల్ 420 విభాగంలో బద్రీనాథ్, రిశ్విక జోడీ ఒక్క పాయింట్ ఆధిక్యంతో చంద్రలేఖ, ధనుశ్ ద్వయంపై ఆధిక్యం కనబర్చగా, 29ఈఆర్ స్కిఫ్స్ విభాగంలో వినోద్, ఆరవింద్ జోడీకి తోడు శరణ్య జాదవ్, శివం వాల్మికి ద్వయం సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

