ఐజిల్ ఆఫ్ మ్యాన్ : అప్రతిహతంగా సాగుతున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీలో అయిదోరౌండ్ ముగిసేసరికి మరో ఇద్దరితో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. అయిదు రౌండ్లలో నాలుగు పాయింట్లు సాధించిన అర్జున్ అమెరికాకు చెందిన హికారు నకముర, రష్యా ఆటగాడు ఆండ్రీ ఎసిపెంకొలతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
అయిదో రౌండ్లో అర్జున్ 69 ఎత్తులలో కజకస్థాన్కు చెందిన రినత్ జుమబయేవ్ను ఓడించగా, నకముర సెర్బియాకు చెందిన అలెక్సీ సరనపై గెలిచాడు. ఎసిపెంకొ అమెరికాకు చెందిన టాప్‌సీడ్ ఫాబియానొ కరునాతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. ఇతర భారత ఆటగాళ్లలో విదిత్ గుజరాతి, పి.హరికృష్ణ, నిహాల్ సరీన్ తమ మ్యాచ్‌లను డ్రాగా ముగించగా, గుకేష్, రౌనక్ సంధ్వాని ఓటమి చవిచూశారు.