DC vs MI : స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యస్తికా భాటియా (41) ఔట్ అయింది. తారా నోరిస్ వేసిన 9వ ఓవర్లో ఆమె ఎల్బీగా వెనుదిరిగింది. దాంతో, 65 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం హేలీ మాథ్యూస్ (31), నాట్ సీవర్ బ్రంట్ (1) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు విజయానికి 60 బంతుల్లో 31 రన్స్ కావాలి.
తొలి ఓవర్ నుంచే ముంబై ఓపెనర్లు యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్ ధాటిగా ఆడారు. ఐదో ఓవర్లో యస్తికి మూడు ఫోర్లు బాదింది. శిఖా పాండే వేసిన నాలుగో ఓవర్లో మాథ్యూస్ మూడు బౌండరీలతో విరుచుకుపడింది. మరిజానే కాప్ వేసిన తొలి ఓవర్లో యస్తికా భాటియా రెండు ఫోర్లు కొట్టింది. 105 టార్గెట్లో వీళ్లే సగం స్కోర్ కొట్టేశారు.