కమిన్స్ హ్యాట్రిక్
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశను ఆస్ట్రేలియా ఘన విజయంతో ఆరంభించింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ పేసర్ పాట్ కమిన్స్ (3/29) టీ20 వరల్డ్‌కప్ 2024 ఎడిషన్‌లో తొలి హ్యాట్రిక్ నమోదుచేయగా మిగతా బౌలర్లు కట్టడి చేయడంతో బంగ్లాదేశ్‌పై 28 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) గెలిచింది.
- ఈ టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి బంగ్లాపై ఆసీస్ ఘన విజయం
అంటిగ్వా: టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశను ఆస్ట్రేలియా ఘన విజయంతో ఆరంభించింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ పేసర్ పాట్ కమిన్స్ (3/29) టీ20 వరల్డ్‌కప్ 2024 ఎడిషన్‌లో తొలి హ్యాట్రిక్ నమోదుచేయగా మిగతా బౌలర్లు కట్టడి చేయడంతో బంగ్లాదేశ్‌పై 28 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) గెలిచింది. అంటిగ్వా వేదికగా శుక్రవారం జరిగిన పోరులో బంగ్లా నిర్దేశించిన 141 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 11.2 ఓవర్ల వద్ద (100/2) వర్షం కురవగా.. అప్పటికే సాధించాల్సిన పరుగుల కంటే ఆసీస్ 28 రన్స్ అధికంగా ఉండటంతో కంగారూలు విజేతగా నిలిచారు. డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో మెరిశాడు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో ప్రధాన బ్యాటర్లు విఫలమవగా సారథి నజ్ముల్ శాంటో (36 బంతుల్లో 41, 5 ఫోర్లు, 1 సిక్సర్), తౌవిద్ హృదయ్ (28 బంతుల్లో 40, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. హ్యాట్రిక్ హీరో కమిన్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
బంగ్లా కష్టంగా..: బంగ్లాదేశ్‌కు మూడో బంతికే షాక్ తాకింది. స్టార్క్ తొలి ఓవర్లోనే ఓపెనర్ తాంజిద్ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి తడబడ్డ లిటన్ దాస్ (16)ను స్పిన్నర్ జంపా బౌల్డ్ చేశాడు. రిషద్(2),షకిబ్ అల్ హసన్ (8) విఫలమయ్యారు. 103 పరుగులకే బంగ్లా సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శాంటో, తౌవిద్ ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. వీరిద్దరు కలిసి సమయోచిత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. 18వ ఓవర్ వేసిన కమిన్స్.. చివరి రెండు బంతుల్లో మహ్మదుల్లా (2), మెహదీ హసన్(0)ను పెవిలియన్‌కు పంపగా 20వ ఓవర్ తొలి బంతికి తౌవిద్ను ఔట్ చేసి ఈ వరల్డ్ కప్‌లో తొలి హ్యాట్రిక్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.
ఆసీస్ ఈజీగా..: ఛేదనలో ఆస్ట్రేలియా ఆది నుంచే వేగంగా ఆడింది. వార్నర్, ట్రావిస్ హెడ్ (21 బంతుల్లో 31, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బంగ్లా బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. 6.2 ఓవర్ల ఆట అయ్యాక ఓసారి వర్షం కురిసింది. ఆట తిరిగి ఆరంభమైన కొద్దిసేపటికే రిషద్.. హెడ్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్(1) నిరాశ పరిచాడు. టస్కిన్ 11వ ఓవర్లో మొదటి బంతినే వార్నర్ భారీ సిక్సర్‌గా మలిచి అర్ధ సెంచరీ పూర్తిచేసిన వెంటనే వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించింది. వాన వల్ల మ్యాచ్ సాగే అవకాశం లేకపోవడంతో డీఆర్ఎస్ నిబంధనలతో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.
ప్రపంచ కప్ ఆసీస్ హ్యాట్రిక్ హీరోస్
- బ్రెట్‌లీ(ఆస్ట్రేలియా) 2007
- పాట్ కమిన్స్(ఆస్ట్రేలియా) 2024
స్టార్క్ అరుదైన ఘనత
బంగ్లాతో మ్యాచ్‌లో ఓపెనర్ తాంజిద్ వికెట్ తీయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ నిర్వహించే పురుషుల వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక వికెట్లు (95) సాధించిన బౌలర్‌గా స్టార్క్ రికార్డులకెక్కాడు. తద్వారా శ్రీలంక దిగ్గజం మలింగ (94) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో షకిబ్ (92), బౌల్ట్ (87), మురళీధరన్ (79) టాప్-5లో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు :
బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 140/8 (శాంటో 41, తౌవిద్ 40, కమిన్స్ 3/29, జంపా 2/24).
ఆస్ట్రేలియా: 11.2 ఓవర్లలో 100/2 (వార్నర్ 53 నాటౌట్, హెడ్ 31, రిషద్ 2/23)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

