Isle of Man | టీ20ల్లో మరో సంచలనం.. 10 పరుగులకే ఆలౌట్
కళ్లు చెదిరే బ్యాటింగ్ విన్యాసాలు, హిట్టర్ల విధ్వంసక ఇన్నింగ్స్‌లకు పేరొందిన టీ20 క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు పది పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో, ఈ ఫార్మాట్లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. 11 పరుగుల టార్గెట్‌ను స్పెయిన్ జట్టు రెండు బంతుల్లోనే విజయం సాధించింది.
Isle of Man : కళ్లు చెదిరే బ్యాటింగ్ విన్యాసాలు, హిట్టర్ల విధ్వంసక ఇన్నింగ్స్‌లకు పేరొందిన టీ20 క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 10 పరుగులకే ఆలౌట్ అయింది. 11 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన మరో జట్టు రెండు బంతుల్లోనే మ్యాచ్ ముగించింది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు పది పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో, ఈ ఫార్మాట్లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది.
పొట్టి క్రికెట్లో ఇప్పటివరకూ అత్యల్ప స్కోర్ సిడ్నీ థండర్స్ పేరు మీద ఉంది. బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టు 15 పరుగులకే కుప్పకూలింది. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు టీ20ల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.
రెండు బంతుల్లో విజయం
11 పరుగుల టార్గెట్‌ను స్పెయిన్ జట్టు రెండు బంతుల్లోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్ అవైస్ అహ్మద్ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. దాంతో, టీ20ల్లో రెండు బంతుల్లోనే విజయం సాధించిన తొలి జట్టుగా స్పెయిన్ రికార్డు క్రియేట్ చేసింది. అతిఫ్ మహమూద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు 2016, 2018లో టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ కోసం పోటీ పడింది. ఈ టీమ్ 2007లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో సభ్యత్వం పొందింది.
కమ్రాన్ హ్యాట్రిక్
ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టులో నాలుగు రన్స్ చేసిన జోసెఫ్ బుర్రోస్ టాప్ స్కోరర్ కావడం విశేషం. ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. స్పెయిన్ బౌలర్ మహమ్మద్ కమ్రాన్ మూడో ఓవర్లో హ్యాట్రిక్ సాధించాడు. ల్యూక్ వార్డ్, కార్ల్ హర్తమాన్, ఎడ్వర్డ్ బియర్డ్ వరుసగా మూడు బంతుల్లో ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కమ్రాన్‌తో పాటు అతిఫ్ మహమూద్ కూడా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
A new world record today. The low T20 team score of 10 by Isle of Man against Spain. We are going to find this extremely hard to better in the Baltic Cup in August. pic.twitter.com/C1zAqUErhy
— Iceland Cricket (@icelandcricket) February 26, 2023
ఇవి కూడా చదవండి
Shardul Thakur – Mittali Parulkar | వివాహ బంధంలోకి శార్దూల్ ఠాకూర్ – మిథాలీ.. ఫొటోలు వైరల్
WPL | వరల్డ్ కప్ విజేతకు గుజరాత్ జెయింట్స్ కెప్టెన్సీ
Rajkumar Sharma | అందరూ విమర్శిస్తుంటే.. అతనొక్కడే కోహ్లీకి మద్దతుగా నిలిచాడు : విరాట్ చిన్నప్పటి కోచ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

