టీ 20 ఫైనల్లో 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ పవర్‌ప్లేలో మూడు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టుకు మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. షాహీన్ ఆఫ్రీది తన ఐదో బంతికి ఓపెనర్ హేల్స్ వికెట్ సాధించాడు. ఫిలిప్ సాల్ట్ పది పరుగులు చేసి హ్యారిస్ రౌఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. బట్లర్ (26 పరుగులు) కీపర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బెన్‌స్టోక్స్, హ్యారీ బ్రూక్స్ క్రీజులో ఉన్నారు.