యుజీన్(అమెరికా): ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అమెరికా స్ప్రింటర్ సిడ్నీ మెక్లాగ్లిన్ ప్రపంచ రికార్డుతో సత్తాచాటింది. శనివారం జరిగిన మహిళల 400మీటర్ల హర్డిల్స్ రేసును సిడ్నీ 50.68 సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని ముద్దాడింది. ట్రాక్‌పై చిరుతను తలపించిన ఈ 22 ఏండ్ల అథ్లెట్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇదే తొలి స్వర్ణ పతకం. ఫెమ్కె బోల్(52.27సె), దిలాహ్ మొహమ్మద్ (53.13సె) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఈ క్రమంలో సిడ్నీ తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు (51.41సె)ను అధిగమించింది.