Suryakumra Yadav : భారత స్టార్ ఆటగాడు, టీ20 నంబర్ 1 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు టెస్టు క్యాప్ అందుకున్నాడు. జాతీయ జట్టులో చోటు కోసం దాదాపు 30 ఏళ్లు నిరీక్షించిన అతను భారత్ తరఫున టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. టెస్టు క్యాప్ అందుకున్న అనంతరం అతను భార్య, తల్లిదండ్రులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. వాళ్లతో దిగిన ఫొటోను సోషల్మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోకు ‘కలలు వేటితో తయారువుతాయి’ అని క్యాప్షన్ రాశాడు. సూర్య ఫ్యామిలీతో ఉన్న ఫొటో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
304వ క్రికెటర్గా
పొట్టి క్రికెట్లో విధ్యంసం సృష్టిస్తున్న సూర్యను టెస్టుల్లో ఆడించాలనే మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. దాంతో, ఊహించినట్టుగానే అతను బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. ఐదో స్థానంలో అతడిని జట్టులోకి తీసుకున్నారు. దాంతో, ఈ ఫార్మాట్లో ఇండియా తరఫున ఆడుతున్న 304వ క్రికెటర్గా సూర్య గుర్తింపు సాధించాడు. మెరుపు వేగంతో బౌండరీలు, సిక్సర్లు బాదే ఈ క్రికెటర్ టెస్టుల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.