Fastest Fifty in ODIs | వన్డేల్లో సూర్య ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. అతడి రికార్డు మాత్రం బ్రేక్ చేయలేకపోయాడు
Fastest Fifty in ODIs : వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు(Team Inida) ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో దంచికొట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగులు చేసింది. పొట్టి పార్మాట్లో అత్యంత ప్రమాదకర ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఆకాశమే హద్దుగా...
Fastest Fifty in ODIs : వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు(Team Inida) ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో దంచికొట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగులు చేసింది. పొట్టి పార్మాట్లో అత్యంత ప్రమాదకర ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూర్య (37 బంతుల్లో 72 నాటౌట్ ; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) దాదాపు 200 స్ట్రయిక్ రేట్‌తో దంచికొట్టాడు.
బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్నట్లు చెరేగిన సూర్య ఆస్ట్రేలియాపై 24 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. దాంతో, ఈ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఆరో భారత క్రికెటర్‌గా సూర్య రికార్డుల్లోకెక్కాడు. అతను విరాట్ కోహ్లీ (27 బంతుల్లో 50; 2013 జైపూర్‌లో)ని అధిగమించాడు.
అజిత్ అగార్కర్

ఓవరాల్‌గా వన్డే ఫార్మాట్లో భారత్ నుంచి ఇది ఆరో వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఈ జాబితాలో అజిత్ అగార్కర్(Ajit Agarkar) అగ్రస్థానంలో ఉండటం విశేషం. 2000లో జింబాబ్వేతో జరిగిన పోరులో అగార్కర్ 21 బంతుల్లో హాఫ్‌సెంచరీ కొట్టాడు. అప్పటి నుంచి ఆటలో వేగం పెరిగినా, ఫార్మాట్ల స్వరూపం మారినా,విధ్వంసక బ్యాటర్లు చాలామంది వచ్చినా అతడి ఆ రికార్డు మాత్రం చెక్కుచెదరలేదు.
వన్డేల్లో వేగవంతమైన ఫిఫ్టీలు కొట్టిన భారత ప్లేయర్లు
1. అజిత్ అగార్కర్ – 21 బంతుల్లో (2000లో జింబాబ్వేపై)
2. కపిల్‌దేవ్ – 22 బంతుల్లో (1983లో వెస్టిండీస్‌పై)
3. వీరేంద్ర సెహ్వాగ్ – 22 బంతుల్లో (2001లో కెన్యాపై)
Indore witnessed a Suryakumar Yadav special ⭐https://t.co/KeHMXTioka #INDvAUS pic.twitter.com/4WHMGlFKb2
— ESPNcricinfo (@ESPNcricinfo) September 24, 2023
4. రాహుల్ ద్రవిడ్ – 22 బంతుల్లో (2003లో న్యూజిలాండ్‌పై)
5. యువరాజ్‌సింగ్ – 22 బంతుల్లో (2004లో బంగ్లాదేశ్‌పై)
6. సూర్యకుమార్ యాదవ్ – 24 బంతుల్లో (2023 ఆస్ట్రేలియాపై)
ఇవి కూడా చదవండి
IND vs AUS | ప్రసిద్ హ్యాట్రిక్ మిస్.. కష్టాల్లో ఆస్ట్రేలియా
IND vs AUS | శతక్కొట్టిన శుభ్‌మన్ గిల్, అయ్యర్.. ఆస్ట్రేలియాపై రికార్డు స్కోర్ చేసిన టీమిండియా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

