సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో వార్నర్ ఏకంగా 300 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ ద్వారా వార్నర్ ఈ మైలురాయి చేరుకున్నాడు. 300 టీ20 మ్యాచ్‌లు ఆడిన 32వ ఆటగాడిగా ఆసీస్ స్టార్ వార్నర్ నిలిచాడు. ఐపీఎల్లో వార్నర్‌కు మంచి రికార్డు ఉంది. దాదాపు అన్ని సీజన్లలోనూ నిలకడగా ఆడుతూ వస్తున్న వార్నర్ 3 సార్లు ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగుల వీరుడు) సొంతం చేసుకున్నాడు. 2015, 2017, 2019 సీజన్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లీగ్‌లో ఇప్పటి వరకు 142 ఇన్నింగ్స్‌ల్లో 5254 పరుగులు సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

