Sunil Gavaskar | ఆ సాకుతో హ్యాండిస్తారా.. వాళ్లపై నిషేధం విధించండి
Sunil Gavaskar : ఐపీఎల్ 17వ సీజన్‌కు కొందరు స్టార్ ఆటగాళ్లు అనుకోకుండా దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలతో, గాయలపాలై మెగా టోర్నీ(IPL 2024) నుంచి వైదొలిగారు. అయితే.. కొందరు మాత్రం తీరా సీజన్ ఆరంభానికి ముందు మేము ఆడట్లేదు అని బాంబ్ పేల్చారు.
Sunil Gavaskar : ఐపీఎల్ 17వ సీజన్‌కు కొందరు స్టార్ ఆటగాళ్లు అనుకోకుండా దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలతో, గాయలపాలై మెగా టోర్నీ(IPL 2024) నుంచి వైదొలిగారు. అయితే.. కొందరు మాత్రం తీరా సీజన్ ఆరంభానికి ముందు మేము ఆడట్లేదు అని బాంబ్ పేల్చారు. దాంతో, ఫ్రాంచైజీలు దిక్కుతోచని స్థితిలో పడడం చూశాం. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి మళ్లీ ఎదురవ్వకుండా ఉండేందుకు భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) బీసీసీఐకి కీలక సూచన చేశాడు.
ఆఖరి నిమిషంలో ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆటగాళ్లకు శిక్ష ఉండాలని, వాళ్లపై నిషేధం విధించాలని కోరాడు. ‘వ్యక్తిగత కారణాల సాకుతో ఆఖరి నిమిషంలో ఐపీఎల్ నుంచి వైదొలగడాన్ని తేలికగా తీసుకోవద్దు. అలా చేయడం వల్ల ఆయా ఫ్రాంచైజీల వ్యూహాలను బెడిసికొట్టేలా చేస్తుంది. అందుకని అలాంటి క్రికెటర్లపై నిషేధం విధించాలి. అప్పుడే మరొకరు అలా ప్రవర్తించరు’ అని గవాస్కర్ బీసీసీఐకి విన్నవించాడు. వేలంలో కోట్లు కొల్లగొట్టి హ్యాండిచ్చే ఆటగాళ్లపై నిషేధం విధించడమే సరైన పనని అతడు అభిప్రయాపడ్డాడు.
ఆడం జంపా, హ్యారీ బ్రూక్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ హ్యారీ బ్రూక్(Harry Brook), రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ ఆడం జంపా(Adam Zampa)లు అనూహ్యంగా పదిహేడో సీజన్ ప్రారంభానికి ముందే ప్లేట్ ఫిరాయించారు. తాము మెగా టోర్నీలో ఆడబోమని చెప్పేసి ఫ్రాంచైజీకి భారీ షాక్ ఇచ్చారు. దాంతో, అయోమయానికి గురైన ఢిల్లీ, రాజస్థాన్‌లు వాళ్ల స్థానంలో మరొకరిని తీసుకున్నాయి.
ఇవి కూడా చదవండి
- Dacoit Movie | అడివి శేష్ ‘డెకాయిట్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
- IPL 2024 | పంజాబ్‌కు భారీ షాక్.. కీలక మ్యాచ్‌లకు దూరమైన ధావన్
- KTR | ఢిల్లీకి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

