Sunil Gavaskar | ఇంగ్లండ్ బాజ్‌బాల్‌కు కౌంటర్‌గా విరాట్ బాల్ : గవాస్కర్
Sunil Gavaskar : దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రాత్మక టెస్టు విజయం నమోదు చేసిన టీమిండియా(Team India) స్వదేశంలో ఇంగ్లండ్(England)తో టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. మరోవైపు బాజ్ బాల్(Bazz Ball) ఆటనే నమ్ముకున్న బెన్ స్టోక్స్(Ben Stokes) సేన భారత బౌలర్లపై పై చేయి...
Sunil Gavaskar : దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రాత్మక టెస్టు విజయం నమోదు చేసిన టీమిండియా(Team India) స్వదేశంలో ఇంగ్లండ్(England)తో టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. మరోవైపు బాజ్ బాల్(Bazz Ball) ఆటనే నమ్ముకున్న బెన్ స్టోక్స్(Ben Stokes) సేన భారత బౌలర్లపై పై చేయి సాధించాలని చూస్తోంది. అయితే.. ఉపఖండ పిచ్‌లపై బాజ్ బాల్ తరహాలో ఆడడం కష్టమే అంటున్నారు మాజీ క్రికెటర్లు. తాజాగా భారత దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
విరాట్ కోహ్లీ తనదైన దూకుడుతో బాజ్‌బాల్ ఆటకు చెక్ పెడతాడని గవాస్కర్ అన్నాడు. ‘ఇంగ్లండ్ జట్టు బాజ్‌బాల్ ఆటను కౌంటర్ చేసేందుకు మాకు విరాట్ బాల్ ఉంది. ప్రస్తుతం కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్న విధానం, క్రీజులో అతడు కదిలే తీరు చాలా బాగుంది’ అని గవాస్కర్ అన్నాడు.
టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ సైతం బాజ్‌బాల్ ఆటను కొట్టిపారేశాడు.
గవాస్కర్, బెన్ స్టోక్స్, మెక్ కల్లమ్

‘ఈ రోజుల్లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అనేది చాలా అరుదు. ఇంగ్లండ్ జట్టు బాజ్ బాల్ ఆటపైనే అందరి దృష్టి ఉండనుంది. భారత పిచ్‌లపై ఇంగ్లీష్ బ్యాటర్ల ఆటతీరు అలానే ఉంటుందా? లేదా? అనేది చూడాలి. స్పిన్ పిచ్‌లపై బాజ్‌బాల్ తరహా ఆట సాధ్యం కాకపోవచ్చు. అయితే.. ఈ సిరీస్‌లో ఇరుజట్లు ఆధిపత్యం చెలాయించేందకు ఆతృతగా ఉన్నాయి’ అని జియోసినిమాతో జహీర్ ఖాన్ వెల్లడించాడు.
విరాట్ కోహ్లీ

సరిగ్గా 12 ఏండ్ల క్రితం భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టు అద్భుతం చేసింది. 2-1తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే.. అప్పటికీ ఇప్పటికీ టీమిండియాలో చాలా మార్పులు వచ్చాయి. ఆ సిరీస్ తర్వాత భారత్ సొంత గడ్డపై వరుసగా 16 టెస్టు సిరీస్‌లు గెలుపొందింది.

ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జనవరి 25న ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు షురూ కానుంది. ఫిబ్రవరి 2న విశాఖపట్టణంలో రెండో టెస్టు, రాజ్‌కోట్‌లో ఫిబ్రవరి 15న మూడో టెస్టు, రాంచీలో ఫిబ్రవరి 23న నాలుగో టెస్టు, ధర్మశాలలో మార్చి 7న ఆఖరి టెస్టు జరుగనుంది.
ఇవి కూడా చదవండి
- NZ vs PAK | ఆఖరి టీ20లో చెలరేగిన బౌలర్లు.. వైట్‌వాష్ తప్పించుకున్న పాకిస్థాన్
- MS Dhoni | ధోనీ వీరాభిమాని ఆత్మహత్య.. అదే ఇంట్లో ఊపిరి విడిచాడు
- Pragya Jaiswal | ప్రగ్యా జైస్వాల్ అందాలకు కుర్రకారు ఫిదా..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

