ఇంగ్లెవుడ్(అమెరికా): ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య అమెరికా అదిరిపోయే బోణీ కొట్టింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారజామున జరిగిన గ్రూప్-డి పోరులో యూఎస్ టీమ్ 4-1 తేడాతో పరాగ్వేపై ఘన విజయం సాధించింది. లాస్ఎంజిల్స్ వేదికగా 70,492 మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన పోరులో అగ్రరాజ్యం జట్టు..పరాగ్వేపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రపంచకప్‌లో గోల్స్ పరంగా(4 గోల్స్)రికార్డు విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 7వ నిమిషంలోనే పరాగ్వే ప్లేయర్ డామియన్ బొబాడిల్లా ఓన్ గోల్‌తో అమెరికా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆరంభంలోనే కలిసొచ్చిన అమెరికా అదే దూకుడు కొనసాగిస్తూ పరాగ్వేపై వరుస దాడులు చేసింది. ఫ్లోరియాన్ బాలొగాన్ (37వ ని), ఫ్లోరియాన్(45+5ని) చెమరో గోల్‌తో స్కోరు 3-0కు చేరుకుంది. పరాగ్వే 73వ నిమిషంలో మారిషియో గోల్‌తో పరువు నిలుపుకుంది. ఆఖర్లో జియోవని రెనా(90+ 8ని) గోల్‌తో అమెరికా ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గ్రూపు-బిలో భాగంగా మరో ఆతిథ్య జట్టు కెనడా, బోస్నియామధ్య మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌కు ముందు కెనడా అంచె ప్రారంభోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. బాలీవుడ్ నటి నోరా ఫతేహి తన ఆటాపాటాతో ప్రేక్షకులను అలరించింది.