హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర యువ బాస్కెట్ ప్లేయర్ గోన ప్రతీక్ క్రీడా మంత్రి శ్రీనివాస్ అభినందించారు. కాలిఫోర్నియాలోని ఇంటర్నేషనల్ బాస్కెట్ కోచ్ జోర్డాన్ లాలీ వద్ద శిక్షణకు ఎంపికైన ప్రతీక్ మంత్రిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ క్రీడల పట్ల ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మాజీ కోశాధికారి గోన విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.