Asia Games | న్యూఢిల్లీ: చైనా వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌కు స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్ ఎంపికయ్యారు. ఎలాంటి ట్రయల్స్ నిర్వహించకుండానే భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) అడ్హాక్ ప్యానెల్ వీరిద్దరిని నేరుగా ఎంపిక చేసింది. అయితే జాతీయ చీఫ్ కోచ్‌లను ఎవరిని సంప్రదించకుండానే అడ్హాక్ ప్యానల్ వీరిని ఎంపిక చేయడంపై మిగతా రెజ్లర్లు, వారి కోచ్‌ల నుంచి ఫిర్యాదులు వచ్చే అవకాశముంది.