న్యూఢిల్లీ: ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఎలైట్ ఓపెన్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ స్విమ్మర్ శ్రీహరి నటరాజన్ ఆకట్టుకున్నాడు. గురువారం జరిగిన పురుషుల 100మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ‘బి’ ఫైనల్లో శ్రీహరి 55.28సెకన్ల టైమింగ్‌తో టాప్‌లో నిలిచాడు. ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నీలోనే నటరాజన్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ప్రీలిమినరీ రౌండ్లో ఈ 21 ఏండ్ల యువ స్విమ్మర్ 55.88సెకన్లలో పూర్తి చేశాడు. మొత్తం 46 మంది స్విమ్మర్లు పోటీపడ్డ రేసులో ‘బి’టాప్‌లో నిలిచిన శ్రీహరి..‘ఎ’ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. బెంగళూరుకు చెందిన ఈ స్విమ్మర్ ఈ విభాగంలో 53.77 టైమింగ్‌తో గతేడాది వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు మహిళల 50మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ఒలింపియన్ మనా పటేల్ 30.17సెకన్లతో 25వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది.